తిరుపతి, ఏప్రిల్ 18,
తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఏకాంతంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్ల తిరుమంజనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేస్తారు.
ఏప్రిల్ 22న శ్రీ సీతారాముల కల్యాణం :
ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరుగనుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం ఏకాంతంగా జరుగనుంది. ఆ తరువాత శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయం లోనే ఊరేగుతారు. ఏప్రిల్ 23న ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు.