YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పిల్లల మర్రికి సెలైన్ చికిత్స

పిల్లల మర్రికి సెలైన్ చికిత్స

మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో చారిత్రక ప్రాధాన్యత గల పిల్లలమర్రి క్రమంగా కోలుకుంటోంది.  గత డిసెంబర్ లో చీడ,పీడలు సోకటంతో నేలమట్టమైన ఈ మహా వృక్షం ఆరోగ్యవంతమవుతోంది. దీనికి నిరంతర పర్యవేక్షణ,ఇంటెన్సివ్ వైద్యం అందేలా చర్యలు చేపట్టారు వైద్యులు. ప్రతిరోజు సెలైన్ లు ఎక్కిస్తూ ట్రీట్ మెంట్ చేస్తున్నారు వైద్యులు..చెట్టుకు సెలైన్ ఏంటి, వైద్యం ఏంటి, ఇంటెన్సివ్ కేర్ ఏంది అని ఆలోచిస్తున్నారా ,.. నిజమే నండోయ్ పాలమూరు జిల్లాకే బ్రాండ్ అంబాసిటర్ అయిన పిల్లలమర్రి మహవ్రుక్షానికి చేస్తున్న వైద్యాన్ని చూస్తే .... చెట్లకూ మనుషులను పోలిన వైద్యమే చేస్తారని ఇట్లే తెలిసిపోతుందిమహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి మహవృక్షం ఏడు వందల సంవత్సరాల వయసున్న ఈ చెట్టు పాలమూరు జిల్లాకే బ్రాండ్ అంబాసిడిర్. అలాంటి మహవృక్షం గత డిసెంబర్ లో చీడ పీడలు సోకి నేలమట్టమయ్యే దశకు చేరుకుంది. మూడెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న చెట్టు పర్యాటక శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఓ ప్రధాన శాఖ కూలి నేలమట్టమవ్వడంతో  జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక శద్ద పెట్టారు. పర్యాటక శాఖ పరిధి నుంచి అటవీ శాఖ కు అప్పగించి చెట్టును కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు.  క్లోరోఫైరఫస్ అనే చీడ నివారణ మందును పిచకారి చేయడంతో పాటు ఇలా గ్లూకోజ్ బాటిల్లలో నింపి చెట్టు కాండం ద్వారా వివిధ శాఖలకు అందేలా వైద్యం చేస్తున్నారు. నిత్యం వందల మంది పర్యాటకులు పిల్లల మర్రి వృక్షాన్ని , ఈ ప్రాంతాన్ని చూడేందుకు వస్తుండగా...  నాలుగు నెలల నుంచి పర్యాటకులకు చెట్టు ఉన్న ప్రాంతం లోకి అనుమతించకుండా ఇంటెన్సివ్ కేర్ మాదిరిగా జాగ్రత్తలు తీసుకుంటన్నారు. మరో వైపు నేల వాలుతున్న ఊడలను , చీడ సోకకుండా నేరుగా భూమిలోకి పాకే విధంగా పైపులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు చెట్టు మొదళ్లు కూలకుండా సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి , చెట్టుకు సారవంతమైన ఎరువు , క్రిమసంహరక మందులు, బలంతో కూడిన మట్టిని పోస్తూ తిరిగి ఆరోగ్యవంతంగా అయ్యేలా చర్యలు చేపట్టారు.చారిత్రక ప్రాధాన్యత గల పిల్లల మర్రికి పూర్వవైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.ఇదిలా ఉంటే మనుషులకు మాదిరిగా ... చెట్లకు సెలైన్ బాటిల్స్ ఎక్కించడం చూసి ఆశ్చర్య పోతున్నారు స్థానికులు. మొత్తం మీద ఏండ్ల కాలం నాటి , చారిత్రక నేపథ్యం , బ్రాండ్ అంబాసిటర్ గా ఉన్న చెట్టు పై జిల్లా కలెక్టర్ శ్రద్ద, అటవీ శాఖ సిబ్బంది కేరింగ్ పై వాహ్వ అంటున్నారు .ఫిబ్రవరి 21 నుంచి ఈ మహావృక్షానికి అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సను ప్రారంభించారు. జిల్లా కలెక్టరు రొనాల్డ్‌రాస్‌, జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డిల పర్యవేక్షణలో సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. రెండు నెలలుగా అయిదు పద్ధతుల్లో చికిత్స అందిస్తూ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పిల్లలమర్రిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో రెండు నెలలపాటు ఇది కొనసాగే అవకాశముంది. ఈ మహావృక్షానికి జరుగుతున్న చికిత్స విధానం ఆసక్తి కలిగిస్తోంది.పిల్లలమర్రి అంటే ఊడలే గుర్తుకు వస్తాయి. అవి దట్టంగా భూమిలోకి పాతుకుపోతే వృక్షానికి బలం. గాలిలో వేలాడుతూ ఉంటే తొందరగా ఎదగవు. కాబట్టి, పీవీసీ పైపులతో ఫెన్సింగులా ఏర్పాటు చేసి అందులో ఎర్రమట్టి, కొబ్బరిపీచు, నాచు కలిపి భూమిలోకి ఊడలను పాతేలా ఏర్పాటు చేశారు. చెట్టుకు ఆధారం ఊడలే కాబట్టి ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. మొత్తం 80 ఊడలు ఉండగా పది ఊడలకు ఈ చికిత్స విధానాన్ని ప్రారంభించారు.చెదలు తొలచివేయడంతో వేర్లు ఊడిపోయి చెట్టు పడిపోతోంది. ఈ నేపథ్యంలో వేర్ల వద్ద మొదట్లో ఉన్న మట్టిని తీసి కొత్త మట్టిని నింపుతున్నారు. పురుగు మందు ద్రావణాన్ని, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. తద్వారా వేర్లలో ఉన్న చెదలను పూర్తిగా నిర్మూలించవచ్చు.కాండం మధ్యలో ఫంగస్‌, చెదలు సమస్యగా మారాయి. ఇలా వదిలేస్తే తొర్రలు, రంధ్రాల ద్వారా పురుగు చేరి చెట్టు మొత్తం పాకుతూ పోతుంది. దీంతో కాండం మధ్యలో కోసి ఫంగస్‌ రాకుండా అందులో కాపర్‌ సల్ఫేట్‌ పేస్ట్‌ను నింపుతున్నారు.పిల్లలమర్రికి ఉండే బరువైన కొమ్మలు గాలికి ఊడి కిందకు పడిపోతున్నాయి. దీంతో తాత్కాలికంగా సిమెంటు స్తంభాలను ఆధారంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 8 కొమ్మలకు వీటిని అమర్చారు. మిగిలిన 26 చోట్ల కూడా ఇదే పద్ధతిలో సంరక్షించనున్నారు.చెదలను తొలగించడానికి ఎక్కువరోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కొమ్మల వద్ద సెలైన్‌ మాదిరి ఏర్పాటుచేసి పైపు ద్వారా పురుగుమందు ద్రావణాన్ని పంపిస్తున్నారు. వాస్తవానికి శాఖల్లోకి పంపింగు ద్వారా ఈ మందును పంపాలని అధికారులు ముందు నిర్ణయించారు. దీనితో ఒత్తిడి పెరిగి రసాయనాలు లోపలి వరకు వెళ్లడం లేదు.  ప్రతి రెండు మీటర్ల దూరానికి డ్రిల్లింగ్‌ మిషనుతో ఒక రంధ్రం చేసి సెలైన్‌ పైపును అమర్చుతున్నారు. ఇందులో పురుగుమందు ద్రావణాన్ని కాండంలోకి చుక్కచుక్క నీరు పడేలా ఏర్పాటు చేశారు. ముందుగా వేరే చెట్టుకు ఈ పద్ధతిని పరీక్షించారు. విజయవంతం కావడంతో పిల్లలమర్రి శాఖలకు అమలు చేస్తున్నారు.

Related Posts