YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నిరాశ, నిస్పృహ మధ్యే కొండా దంపతులు

నిరాశ, నిస్పృహ మధ్యే కొండా దంపతులు

సమకాలిన రాజకీయాల్లో కోండ దంపతులది విలక్షణ శైలి. అనుకున్నది సాదించేందుకు ఏంతదూరమైన పయనిస్తారు. సోంతపార్టీలో సైతం దిక్కారస్వరం వినిపిస్తారు. అందుకే రాజకీయాల్లో వీరిని ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారు. రోశయ్య, కిరణ్ కుమార్ రేడ్డిపై తిరుగుబాటు చేశారు. కూతురుకి టికేట్ ఇప్పించుకునే విషయంలో కోండ దంపతులు కేసీఆర్ పై ప్రయోగిస్తున్న పాచికలు పారుతాయ...తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ తిరుగులేని నేత. ప్రభుత్వంలో, టీఆర్ఎస్ పార్టీలో ఆయన మాటకు ఎదురే లేదు. పార్టీ నాయకులను తన కను సైగలతో చంద్రశేఖర్ రావు శాసిస్తున్నారు. అలాంటి కేసీఆర్ కు కొండా సురేఖ దంపతులు షరతులు విధిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కండిషన్స్ పెడుతున్నారు. వారి నోటి నుంచి డిమాండ్లు  రాకపోయినా వారి మనసులో మాట మాత్రం అదే. 

కొండా దంపతులు పార్టీ మారుతున్నారనే ప్రచారం గత కొన్నాళ్ల నుంచి జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న రీతిలో వదంతులు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు కొండా సురేఖ ఖండిస్తూనే ఉన్నారు. తాము కేసీఆర్ తోనే ఉంటామని తేల్చి చెపుతున్నారు.  పనిలో పనిగా ఆమె కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికి ఫిరాయింపు ప్రచారం కొనసాగుతూనే ఉంది.

 రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో గుప్పుమన్నది. దీంతో మళ్ళీ ఆమె మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటిలాగానే తాను పార్టీ మారడం లేదని చెప్పిన సురేఖ మరో మాట చెప్పుకొచ్చారు. ఈ సారి తనతో పాటు తన కుమార్తె కు టిక్కెట్ వస్తుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తమ కుమార్తె సుష్మితా పటేల్ ను రాజకీయ వారసురాలిగా తీసుకురావడానికి కొండా దంపతులు గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో పాటు కుమార్తెకు టిక్కెట్ ఇప్పించుకోవాలన్నది వారి పట్టుదల.అయితే టీఆర్ఎస్ లో కొండా  ఇంట్లో రెండు టిక్కెట్లు సాధ్యమయ్యేలా పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొండా మురళీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఉండగానే మరో రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం చిన్న విషయం కాదు. ప్రస్తుతం వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లో ఎక్కడా ఖాళీలు లేవు. గతంలో సురేఖ ప్రాతినిధ్యం వహించిన పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉన్నారు. మరో సారి కూడా ఆయనకే టిక్కెట్ దక్కడం ఖాయం. ప్రస్తుతం కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మంత్రి బస్వరాజు  సారయ్య  పోటీకి సై అంటున్నారు. ఎర్రబెల్లి, కొండా దంపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దయాకర్ రావు తన సోదరుడిని తన  నియోజకవర్గంలో ప్రోత్సహించడాన్ని సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇక్కడ వర్గ పోరు తీవ్రమైంది.వీటన్నింటి నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తనతో పాటు తన కుమార్తె కు కూడా టిక్కెట్‌ ఇవ్వాలంటు సురేఖ స్వరం పెంచారు. ఇప్పటి వరకు ఇంకో టిక్కెట్ గురించి మాట్లాడని ఆమె నేరుగా కేసీఆర్ కు తగిలా గళాన్ని వినిపించారు. ఒక వేళ రెండు టిక్కెట్లు రాకపోతే తమ దారి తాము చూసుకుంటామన్న సంకేతాలను సురేఖ గులాబీ పార్టీకి పరోక్షంగా పంపిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితే లేదు. ఎమ్మెల్యేలు కాని,ఎం.పిలు కాని తమ టిక్కెట్లపైన  బహిరంగంగా మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. కొండా సురేఖ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహారిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో  కొండా సురేఖ రెండు టిక్కెట్లు తెచ్చుకొని టీఆర్ఎస్ లో కొనసాగుతారో లేక పంతం నెగ్గించుకోవడం కోసం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి

Related Posts