YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పినరయికే పీఠం

పినరయికే పీఠం

తిరువనంతపురం, ఏప్రిల్ 19, 
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. ఈసారి కేరళలో హోరాహోరీ పోరు జరిగింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఓపీనియన్ పోల్స్ పినరయి విజయన్ మరోసారి అధికారంలోకి వస్తాయని చెప్పాయి. అయితే ప్రచారం తర్వాత అనూహ్యంగా మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది.కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. 71 స్థానాలు వస్తే అధికారాన్ని చేజిక్కించుకునట్లే. కేరళ లో సంప్రదాయం ప్రకారం ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి విజయం సాధించలేదు. ఇది నలభై నాలుగు సంవత్సరాల నుంచి చెబుతున్న రాజకీయ చరిత్ర. అయితే దీనిని ఈసారి పినరయి విజయన్ బ్రేక్ చేస్తారని ఎల్డీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో అత్యధికులు విద్యాధికులు కావడంతో పినరయి విజయన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.బీజేపీ బలం పెంచుకోవడం కూడా పినరయి విజయన్ కు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమయింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈసారి బీజేపీ ఓటు శాతాన్ని పెంచుకునే అవకాశముంది. ఇది విపక్షంలో ఉన్న ఎల్డీఎఫ్ కే దెబ్బ అన్నది పరిశీలకుల మాట. పినరయి విజయన్ కూడా ఇదే ఆశలు పెట్టుకున్నారు. మరోసారి తనకు అవశాశమిస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూడా పోటా పోటీగా ఉంది. ఓపీనియన్ పోల్స్ లో 62 స్థానాలు యూడీఎఫ్ కు రావచ్చని తేలింది. అయితే నెలరోజుల నుంచి వచ్చిన మార్పులు తమకు అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాహుల్ గాంధీ పర్యటనతో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా కాంగ్రెస్ కు కలసి వస్తాయంటున్నారు. మొత్తం మీద పినరయి విజయన్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే మరో సారి  పినరయి విజయన్  ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది.

Related Posts