YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జగనన్న విద్యా దీవెన’ పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఈ విద్యా సంవత్సరం (2020–21)లో తొలి త్రైమాసిక చెల్లింపులు

జగనన్న విద్యా దీవెన’ పథకంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్  ఈ విద్యా సంవత్సరం (2020–21)లో తొలి త్రైమాసిక చెల్లింపులు

అమరావతి
ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని సోమవారం నాడు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ మేరకు జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్క క్లిక్తో నగదు జమ చేశారు. 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదు కింద అర్హులైన 10,88,439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఆస్తి చదువు. దీన్ని నేను గర్వంగా చెబుతున్నాను.  పిల్లల చదువులకు ఇబ్బంది పడకూడదు.  ఆ తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న ఉద్దేశం.  అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం.  పక్కాగా జగనన్న విద్యా కానుక పథకం అమలు చేస్తామని అన్నారు.
అన్ని శాఖలు ఈ పథకాన్ని ఓన్ చేసుకున్నాయి. ఇందులో నేను పాలు పంచుకుంటున్నాను. ఇది నా ద్వారా జరగడం దేవుడిచ్చిన అదృష్టం. ప్రతి మూడు నెలలకు ఫీజు నేరుగా తల్లుల ఖాతాలో జమ అవుతాయి.  వారు ఆ ఫీజును వారం రోజుల్లో కాలేజీలకు చెల్లిస్తారు. కాలేజీలలో వసతులు లేకుంటే ప్రశ్నించే వీలు కలుగుతుంది. కాలేజీ యాజమాన్యాలకు కూడా జవాబుదారీతనం వస్తుంది. 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం మొదలు పెడుతున్నాం. మూడేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలలో చేర్చడం,  ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలకు, తల్లులకు అండ గా వుంటాయం. అంగన్వాడీలను ప్రిప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేస్తాం. ఇంగ్లిష్ మీడియమ్ కూడా ప్రవేశపెడుతున్నాం. నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు వచ్చాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద. పిల్లలకు మేనమామలా తోడు వుంటాననని అన్నారు.
చదువు ఎంతో ముఖ్యం:
‘పెద్ద చదువన్నది ఇప్పుడు ఒక కనీస అవసరంగా మారిపోయింది. పేదరికం నుంచి బయటపడేందుకు, మెరుగైన ఆలోచనలకు, మంచి ఉద్యోగానికి–ఉపాధికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, సమాజంలో గౌరవం పొందటానికి, ఒక మనిషి తన తరవాతి తరం భవిష్యత్తుకు మెరుగైన బాటలు వేయటానికి పెద్ద చదువన్నది కనీస అవసరంగా మారింది. నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇస్తున్న ఆస్తి చదువు అని గర్వంగా చెబుతున్నాను’.
‘ 9,79,445 మంది తల్లులు, దాదాపు 10.88 లక్షలకు పైగా పిల్లలకు మేలు కలిగించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో చాలా చోట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్వయంగా వారి కష్టాలు, బాధలు చూశాను. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేస్తున్నానని అన్నారు.
 ‘ఇవాళ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని వివరాలతో లేఖలు తల్లులకు లేఖ రాయడం జరిగింది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురైనా 1902కు ఫోన్ చేయమని మరోసారి కోరుతున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ప్రభుత్వంపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.. అంటూ సీఎం ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి  ధర్మాన కృష్ణదాస్, విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సతీష్చంద్ర, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డితో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పథకం లబ్ధిదారులు, అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. శ్రీకాకుళం నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్దండే మాట్లాడారు.

Related Posts