కర్నూలు
కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్లో పాఠశాలలు, కళాశాలలు వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపాలా వద్దా అని తల్లిదండ్రులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు కోవిడ్ బారిన పడిన విద్యార్థులకు డాక్టర్ల సలహాలతో చికిత్స అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం తెలిపారు.. హాస్టల్స్ తో అనుబంధం ఉన్న పాఠశాలలో ఎక్కువగా కేసులు వచ్చినట్లు ఆయన అన్నారు