కైరో
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈజిప్టులో రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న బన్హాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తున్నారు. కైరో నుంచి డెల్టాలోని మన్సౌరాకు వెళ్తుండగా టోక్ అనే పట్టణం వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మొత్తం నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలిపారు. బోగీల్లో చిక్కకున్నవారిని బయటకు తీస్తున్నారు.
సహాయక చర్యల్లో 60కిపైగా అంబులెన్స్‌లు పాలుపంచుకున్నాయని చెప్పారు. గాయపడినవారిలో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. చాలామందికి కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించింది. రైలు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, గత నెలల్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు.