YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దొంగ ఓట్లు వేస్తే 90 శాతం పోలింగ్ అయ్యేది

దొంగ ఓట్లు వేస్తే 90 శాతం పోలింగ్ అయ్యేది

కర్నూలు, ఏప్రిల్ 19, 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు పడలేదని, తమకు ఆ అవసరమే లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మంత్రి కొడాలి నాని అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేస్తే 80 నుంచి 90 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, తిరుపతి ఎన్నికలలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలో వైసీపీకి 4.50 లక్షల మెజారిటీతో గెలవబోతోందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారుఅలాగే, కరోనా నియంత్రణ చేసేందుకు మరోసారి లాక్‌డౌన్ పెట్టడం పరిష్కారం కాదని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ప్రజలే స్వచ్ఛందంగా మాస్కులు, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇక, తెలంగాణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీపై తాను స్పందబోనని కొడాలి నాని వ్యాఖ్యానించనన్నారు.
కాగా, ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేసిందని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ తరుణంలో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Posts