YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాహుల్ బాటలో దీదీ

రాహుల్ బాటలో దీదీ

కోల్ కత్తా, ఏప్రిల్ 19, 
దేశాన్ని కరోనా వైరస్ చాపలా చుట్టేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, రాహుల్ బాటలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పయనిస్తున్నారు. చివరి మూడు విడతల ఎన్నికల ప్రచారానికి దీదీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డేరక్ ఓ బ్రెయిన్ తెలిపారు. చివరి రోజున ఏప్రిల్ 26న మాత్రమే కోల్‌కతాలో జరిగే సభలో మమతా బెనర్జీ పాల్గొంటారని ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.కోల్‌కతా సహా మరెక్కడా మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించరు.. కేవలం చివరి రోజున ఏప్రిల్ 26న కోల్‌కతాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు... అన్ని జిల్లాల్లో అధినేత్రి ఎన్నికల ర్యాలీలకు సమయం కుదించుకున్నారు.. కేవలం 30 నిమిషాలకు పరిమితం చేశారు’’ అని ఓ బ్రెయిన్ ట్విట్టర్‌ తెలిపారు. పశ్చిమ్ బెంగాల్‌లో అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం అక్కడ కొత్తగా 8,419 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,59,927కి చేరింది.అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండగా.. కోవిడ్ వ్యాప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు భారీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరగడంతో చిన్న చిన్న సభలు, ర్యాలీలకే పరిమితమవుతామని మమతా బెనర్జీ ప్రకటించారు. ఇదిలా ఉండగా, పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని మిగతా దశలను ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు టీఎంసీ విజ్ఞ‌ప్తి చేసింది. అయితే, ఈ అభ్యర్థనను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు.అయితే, ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కుదించింది. ప్రచారాన్ని ఇప్పటి వరకు 48 గంటల ముందే ముగిస్తుండగా.. దానిని 72 గంటలు చేసింది. అలాగే, సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 10.00 గంటలకు ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని ఆదేశించింది. ర్యాలీలు, బహిరంగ సభలు, వీధి నాటకాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకే అనుమతించింది.

Related Posts