YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గులాబీ రంగు వాట్సాప్ మహా డేంజర్ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు ..సైబర్ నిపుణులు

గులాబీ రంగు వాట్సాప్ మహా డేంజర్ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు ..సైబర్ నిపుణులు

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 19
రోజు రోజుకి సైబర్ క్రైమ్ భారీన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ మధ్య ఫేక్ లింకులు వాట్సాప్ లో ఎక్కువగా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో లింకు కూడా వైరల్ అవుతుంది. వాట్సాప్ థీమ్‌ను డిఫాల్ట్ ఆకుపచ్చ రంగు నుంచి గులాబీ రంగులోకి మార్చుకోండి అనే లింక్‌ పేరుతో సందేశం వస్తుంది. అయితే, ఈ లింకులను ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయవద్దు అని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేల ఆ లింక్‌పై క్లిక్ చేస్తే సైబర్ క్రైమినల్స్ మీ ఫోన్‌ను హ్యాక్ చేయవచ్చు. మీరు మీ వాట్సాప్ ఖాతాలో లాగిన్ కావడానికి అవకాశం కోల్పోవచ్చు. అలాగే ఫోన్‌లోని ఫొటోలు, సందేశాలు, కాంటాక్ట్స్‌ వంటి సమాచారమంతా సైబర్‌ కేటుగాళ్ల చేతికి వెళ్లిపోతుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు రాజశేఖర్‌ రాజహరియా తెలిపారు. వాట్సాప్‌ అధికారిక యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వోయగర్‌ ఇన్ఫోసెక్‌ డైరెక్టర్‌ జితెన్‌ జైన్‌ పేర్కొన్నారు. పింక్‌ వాట్సాప్‌, గోల్డ్‌ వాట్సాప్‌ తదితర యాప్స్‌ నకిలీవని తెలిపారు. నకిలీ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Related Posts