YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నెల్లూరులో ఎస్పీ స్టైల్ ట్రాన్స్ ఫర్స్

నెల్లూరులో ఎస్పీ స్టైల్ ట్రాన్స్ ఫర్స్

 తమకు నచ్చిన వాడిన నచ్చిన చోటికి బదిలీ చేయాలంటూ ఎస్పీ బాస్ పై ఒత్తిడులు ఉండేవి.. కొన్ని సార్లు పోలీసులే  రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారు.. తమకు నచ్చిన చోట బదిలీలు చేయించుకునేవారు.. అందుకు లక్షల్లో సొమ్ము చేతులు  మారేవి.. కానీ పైరవీలు దూరంగా.. ఉద్యోగుల ఇష్టాలతో బదిలీలు జరిగాయి. .ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా మొదటి సారి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఎస్పీ బదిలీలకు శ్రీకారం చుట్టారు.. ఆయనే నెల్లూరుజిల్లా ఎస్పీ పిహెచ్ డీ రామకిష్ణ..

 

నెల్లూరుజిల్లాఎస్పీగా పిహెచ్ డీ రామకిష్ణ చార్జ్ తీసుకున్నప్పటికీ అనేక ప్రయోగాలు చేశారు. పోలీస్ శాఖలో తన మార్క్  కనిపించేలా పనిచేస్తున్నారు.  అరోపణలు ఎదుర్కొంటున్న వారిని విఆర్ కు పంపినా..  అవినీతి చేసిన వారిని సస్పెండ్ చేసినా ఆయనకే చెల్లు.. దాంతో పాటు ముక్కుసూటిగా ఉంటారనేది ఆయనమీద  పోలీస్ శాఖలో ఉండే అభిప్రాయం.. పైరవీలను ఎస్పీ ఆఫీస్ కాంపౌండ్ వద్దకు కూడా రానివ్వరని టాక్..

 

ఎస్పీతో మాట్లాడి తమకు ఫేవర్ చేయండి సార్ అంటే.. ఆయన ఎవ్వరు చెప్పిన వినరులే.. అని రాజకీయ నాయకులే చెప్పుకుంటున్నారు.. అలాంటి పిహెచ్ డీ రామకిష్ణ.. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ బదిలీలలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.. ప్రతి ఒక్కరూ అన్ని స్టేషన్లలో పనిచేయాలి, సీనియార్టీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలతో బదిలీలలకు శ్రీకారం చుట్టారు.

 

`బదిలీలలకు మెడికల్, ఇంజనీరింగ్ తరహాలో ఒక కమిటీని ఏర్పాటు చేసి బదిలీలలను

 

పారదర్శకంగా నిర్వహించారు.. అందుకు పర్యవేక్సణకు  తనతో పాటు ఓ అడిషనల్ ఎస్.పి. ఎస్బీ డిఎస్పీ, ఎస్పీ, ఎస్టీ సెల్ డిఎస్పీతో పాటు మరో ఇద్దరు అసోసియేషన్ సభ్యులను నియమించారు.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి వివరాలను, నేటివ్ సర్కిల్ లో పని చేసేవారి వివరాలను, 12 ఏళ్ల నుంచి ఒకే సర్కిల్ లో పనిచేస్తున్న 

 

వారి వివరాలను కమిటి సభ్యులు సేకరించి nellorepolice.co వెబ్ సైట్ లోను, వాట్స్ యాప్ లోను డిస్ ప్లే  అయ్యే విధంగా వివరాలను విడుదల చేశారు..

 

మెడికల్ సంబంధిత అభ్యర్ధనలు , స్పౌస్ కోటా సంబంధిత అభ్యర్ధనలు, స్పెషల్ రిక్వెస్ట్ లను పరిశీలించేందుకు కూడా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.. కౌన్సలింగ్ కు హజరైన అభ్యర్దులు సమక్షంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి, సర్వీస్ వివరాలను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తూ , 

 

మరో ప్రక్క వేకంట్  పోసిషన్ తెలియ పరిచే వివరాలను డిస్ప్లే చేయడంతో పాటు కమిటిభ్యులు సేకరించిన మెడికల్ గ్రౌండ్ లో బాధపడుచున్న వారి వివరాలను, స్పౌస్ , 

 

స్పెషల్ రిక్వెస్ట్ చేసిన అభ్యర్దులు వివరాలను కూడా డిస్ప్లే చేస్తూ, ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు.. 

 

ఎలాంటి అవకతవకలు జరక్కుండా దాదాపు 175 పోలీస్ సిబ్బందిని బదిలీలు చేశారు.. ఎస్పీ తీసుకున్న ఈ శ్రద్దతో బదిలీ అయిన వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. .మొదటిసారి ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా ఇలాంటి బదలీలు నిర్వహించడం అభినందనీయమని వారు చెబుతున్నారు.

Related Posts