కడప
పేద విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం ప్రవేశ పెట్టిన పథకమే జగనన్న విద్యా దీవెన పథకమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కోన్నారు. కడప నగరంలోని కలెక్టరేట్ లో జగనన్న విద్యా దీవెన పథకాన్ని లాఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను సైతం చిరునవ్వుతో స్వాగతించి చెల్లించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కిందని కోనియాడారు. ఏ కళాళలలో చదివినా, ఎంత ఫీజైనా ఆ ఫీజునంతా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 72,039 మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. దివంగత నేత వైఎస్ అమలు చేసిన పీజు రీఎంబ్రిష్ మెంట్ పథకాన్ని మరింత మెరుగు పరిచి జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చెయ్యడం జరిగిందన్నారు. పేద విద్యార్దులు ఉన్నత విద్యకు దూరం కాకుడదన్న సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.