YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల నియమావళి ప్రకారం పంచాయతి ఉప ఎన్నికల నిర్వహణ జిల్లా కలెక్టర్ జి.రవి

ఎన్నికల నియమావళి ప్రకారం పంచాయతి ఉప ఎన్నికల నిర్వహణ జిల్లా కలెక్టర్  జి.రవి

జగిత్యాల ఏప్రిల్ 19
ఎన్నికల నియమావళి ప్రకారం పంచాయతి ఉప ఎన్నికలను నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ జి.రవి  సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సూచించారు.సోమవారం జగిత్యాల అర్భన్  ఎంపిడిఒ కార్యాలయంలో 2021 సంవత్సరంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతి సర్పంచ్లు, వార్డు మెంబర్ల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు (స్టేజ్1 &2)  నిర్వహించిన  శిక్షణ   కార్యక్రమంలో  కలెక్టర్ పాల్గోన్నారు. త్వరలో   జిల్లాలో ఖాళీగా ఉన్న  వార్డులు మరియు పంచాయతిలకు సంబంధించి  ఎన్నికల షెడ్యులు విడుదల అవుతుందని, వాటిని నిబంధనల మేరకు నిర్వహించేందుకు సన్నద్దంగా ఉండాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఎన్నికలను ముఖ్యంగానే భావించాలని, ఎక్కడా అలసత్వం  ప్రదర్శించవద్దని  కలెక్టర్  సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సిన   కార్యక్రమాలకు సంబంధించి వివరాలు అందజేస్తామని, వాటిని యదావిధిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలో ఎన్నికల షెడ్యులు వచ్చిన తరువాత నామినేషన్ల స్వీకరణ,  నామినేషన్ల స్క్రూటిని, గుర్తుల కేటాయింపు తదితర అంశాలో పూర్తి స్థాయిలో  పారదర్శకంగా ఎన్నికల నిబంధనల మేరకు  పనిచేయాలని  కలెక్టర్ ఆదేశించారు. పంచాయతి ఎన్నికలు గుర్తింపు పొందిన పార్టిలకతీతంగా జరుగుతాయని, అయినప్పటికి వివిధ పార్టీలు అభ్యర్థులు బలపరుస్తాయని,  ఎన్నికల విధులలో ఎవరికి పక్షపాతంగా విధులు నిర్వహించడానికి వీలు లేదని,  అందరిని సమదూరంతో చుడాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని,  ఎలాంటి పొరపాట్ల  జర్గకుండా   ప్రణాళిక  సిద్దం చేసుకోవాలని సూచించారు.  ఎన్నికల షెడ్యులు విడుదల అయిన తరువాత ప్రతి రోజు చేయాల్సిన పనుల గురించి ముందస్తుగానే  తయారు చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల వివరాలు  తదితర వాటివి నిబంధనల ప్రకారం  రెండు మూడు సార్లు సరి చుసుకోవాలని  కలెక్టర్  తెలిపారు. నామినేషన్ స్క్రూటిని ప్రక్రియను వీడియోగ్రాఫీ చేయించాలని సూచించారు.  ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనల , నియమాల పై క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణ శ్రీ, జిల్లా పంచాయతీ అధికారి నరేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Posts