YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలంలో ఏకగ్రీవ పంచాయతీ

కమలంలో ఏకగ్రీవ పంచాయతీ

హైదరాబాద్, ఏప్రిల్ 20 
లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది. భేటీ జరిగిన సమయంలో ఏమి జరిగిందో తేల్చాలంటూ..తెలంగాణ బీజేపీ త్రిసభ్య కమిటీ వేసింది. ఈ కమిటీలో జాతీయ ఏస్సీ మోర్చా కార్యదర్శి ఎస్. కుమార్, యెండల లక్ష్మీనారాయణ, మల్లారెడ్డిలున్నారు.కేవలం రెండు రోజుల్లో రిపోర్టు సమర్పించాలని నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేటీఆర్ తో కలిసిన సందర్భంగా..ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో కమిటీ నిగ్గు తేల్చనుంది. టీఆర్ఎస్ పై పోరాడుతూనే…కార్పొరేట్ ను ఏకగ్రీవం చేయడానికి మంత్రి కేటీఆర్ ను కలుస్తారా ? అంటూ అధినాయకత్వం గుస్సాగా ఉంది. సమావేశం సందర్భంలో..బండి సంజయ్ పై కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు వారించకుండా..బీజేపీ నేతలు మిన్నకుండి పోయారని భావిస్తున్న నాయకత్వం ఈ భేటీని తీవ్రంగా పరిగణిస్తోంది. నివేదికను రాష్ట్ర నాయకత్వానికి సమర్పించిన తర్వాత..బీజేపీ నేతలపై చర్యలు తీసుకోనే అవకాశం ఉంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ క్యాడిండెట్ ఆకుల రమేష్ గౌడ్ గెలిచారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాసరావుపై ఆయన విజయం సాధించారు. ఆయన ఇటీవలే చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో…ఇక్కడ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామ్ చందర్ రావు, ఆకుల రమేశ్ కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కలవడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలను బీజేపీ నేతలు కలవడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఏకగ్రీవానికి ఎలా మద్దతు కోరుతారని తీవ్రంగా మండిపడ్డారు.  టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లింగోజీగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.ఈ డివిజన్ కు ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఏకగ్రీవ ఎన్నిక కోసం సహకరించాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ సలహాతో టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.ఏప్రిల్ 30న జరగనున్న ఉపఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన ఏకగ్రీవ ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ప్రగతిభవన్ లో కేటీఆర్ ని కలిసి విజ్ఞప్తి చేసింది.ప్రమాణస్వీకారం కూడా చేయకముందే రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరం అని, వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టొద్దని బీజేపీ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఈ ఉపఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుక గాను కేసీఆర్, కేటీఆర్ లకు బీజేపీ బృందం కృతజ్ఞతలు తెలిపింఇలాంటి భేటీలతో తప్పుడు సంకేతాలు వెళుతాయని నాయకత్వం భావిస్తోంది. మరి నివేదిక వచ్చిన తర్వాత..ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related Posts