YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

డ్రా చేస్తున్నదంతా..ఏమౌతోంది...

 డ్రా చేస్తున్నదంతా..ఏమౌతోంది...

దేశప్రజలు ఎదుర్కోంటున్న ప్రధాన  సమస్య నగదు కోరత..కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల ను రద్దు చేసిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల ఎదుటబారులు తీరారు.కొంత కాలం తర్వాత ఈ సమస్య సర్దుమనిగింది.కోద్ది రోజుల క్రితం నుంచి మళ్లీ నగదు కోరత ఎర్పడింది ఈ సారి కేంద్రం ఏటీఎమ్‌లను నింపే పనిలో పడింది... ప్రజలు డబ్బును  తీసుకుంటున్నారు.. కానీ ఖర్చు పెట్టట్లేదు.. ఆ డబ్బంతా ఎమైతుంది.... న‌ల్లధ‌నంపై పోరు ప్రకటించిన ప్రధాని మోడీ దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశ‌వ్యాప్తంగా చాలా సమస్యలు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న రూ.500, వెయ్యి రూపాయల నోట్ల ను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్త కరెన్సీని అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకుల ద్వారా పాతనోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించింది. రద్దు చేసిన పెద్దనోట్లను మార్చుకునేందుకు అప్పట్లో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు.  బ్యాంకుల ఎదుటబారులు తీరారు. ఏటీఎంల దెగ్గర నోక్యాష్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడంతో ప్రజల కు కరెన్సీ కష్టాల నుంచి కొంత ఉపశమనం లభించింది.కాని డీమానిటైజేషన్ టైం లో వచ్చిన కరన్సీ కష్టాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అన్ని బ్యాంక్ లూ ,ఏటీఎం ల దగ్గర మనం అప్పట్లో చూసిన నో క్యాష్ బోర్డ్ లు మళ్ళీ దర్సనం ఇస్తూ ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం మరీ ఎక్కువగా సాగుతోంది. గత మూడు వారాలుగా చాలా చోట్ల ఏటీఎం లు మూత పడిపోయాయి.నగదు కోసం జనాలు ఏటీఎం లూ బ్యాంక్ లూ వద్ద క్యూలు కడుతున్నా డబ్బులు దొరకడం లేదు. విత్ డ్రాలపై పరిమితి ఎత్తివేయడంతో, బ్యాంకుల నుంచి వినియోగదారులు పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. దీంతో, కరెన్సీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ రంగంలోకి దిగాయి. నగదు ముద్రణ యంత్రాలకు పని కల్పించారు. ఖాళీ ఏటీఎమ్‌లను నింపడానికి శ్రమించారు.ఇంతా చేస్తే.. ఏటీఎమ్‌లలో పెట్టిన డబ్బు పెట్టినట్లు మాయమవుతోంది. కానీ వ్యవస్థలోకి మాత్రం తిరిగి రావడం లేదు. మళ్లీ అవి పరుపుల్లోకి వెళుతున్నాయా....? నగదు కొరతను తట్టుకోలేక...... లేదంటే బ్యాంకుల నుంచి రుణాలు అందుతాయో లేదో అని  నగదును దాచేస్తున్నారా....?    2000 నోట్లు తిరిగి వ్యవస్థలోకి రాకపోవడానికి ఇవే కారణమా..? మరే ఇతర కారణం ఉందా...? ఇప్పడు ఇలాంటి ప్రశ్నలు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఆర్‌బీఐ గణాంకాలు చేప్తున్న వివరాలు  ఆశ్చర్యం కలిగిస్తున్నాయి..ప్రజలు బ్యాంకుల వద్ద నగదును తీసుకోని తిరిగి ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ముందస్తు జాగ్రత్తగా నగదును దాచి ఉంచుకోవడం కూడ ఒక కారణం అని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి..ఏప్రిల్‌ 20తో ముగిసిన వారంలో బ్యాంకులు లేదా ఏటీఎమ్‌ల నుంచి రూ.16,340 కోట్లు బయటకు వెళ్లాయి. ఈ నెలలో తొలి మూడు వారాల్లో మొత్తం మీద ప్రజలు రూ.59,520 కోట్లను బయటకు తీసుకున్నారని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రైతులకు సీజను కావడంతో నగదు అవసరాల కోసం నగదును డ్రా చేసుకోవడం., ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగానికి తగినట్లుగా ఆర్‌బీఐ నుంచి కరెన్సీ సరఫరా జరగకపోవడంతో కూడా నగదుకు గిరాకీ పెరిగిందని కూడా భావిస్తున్నారు. కొది రోజుల్లోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది నగదును ఎక్కువగా సరఫరా చేయడం వల్ల మాత్రమే తప్ప ప్రజల నుంచి చెలామణీలోకి ఎక్కువ డబ్బు రావడం వల్ల కాదని భావించవచ్చు. ఆ పరిస్థితి మారాలంటే మాత్రం ప్రజల్లో అనుమానాలు పోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. మరి ఈ నగదు కోరత ఎప్పటికి తీరుతుందో వేచి   చూడాలి...

Related Posts