న్యూఢిల్లీ ఏప్రిల్ 20
ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశారు. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షలను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అయితే ఆ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు బోర్డు పేర్కొన్నది. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం కీలకమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ చెప్పింది.