YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశ‌వ్యాప్తంగా 23 శాతం వ్యాక్సిన్లు వృథా

దేశ‌వ్యాప్తంగా 23 శాతం వ్యాక్సిన్లు వృథా

న్యూఢిల్లీ ఏప్రిల్ 20
దేశ‌వ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వ‌ర‌కు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఈ విష‌యం తెలిసింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో అత్య‌ధిక స్థాయిలో టీకాలు వృథా అయిన‌ట్లు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 45 ఏళ్లు దాటిన వారంద‌రికీ టీకాలు ఇస్తున్నారు. ఇక మే ఒక‌టో తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి కూడా టీకాలు ఇవ్వ‌నున్నారు. కోవీషీల్డ్‌, కోవాగ్జిన్ టీకాలను ప్ర‌స్తుతం ఇండియ‌న్ల‌కు ఇస్తున్నారు. త‌మిళ‌నాడుతో పాటు హ‌ర్యానా, పంజాబ్‌, మ‌ణిపూర్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్లు వృథా అయిన‌ట్లు గుర్తించారు. ఇక కేర‌ళ‌, బెంగాల్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, మిజోర‌మ్‌, గోవా, డ‌మ‌న్ అండ్ డయూ, అండ‌మాన్ నికోబార్ దీవులు, ల‌క్ష‌ద్వీప్‌లో మాత్రం జీరో వేస్టేజ్ ఉన్న‌ట్లు ఆర్టీఐ ద్వారా వెల్ల‌డైంది.

Related Posts