YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మునక్కాయ‌ల కన్న మున‌గాకే మిన్న..! పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఇనుము ఎక్కువ

మునక్కాయ‌ల కన్న మున‌గాకే మిన్న..! పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఇనుము ఎక్కువ

హైద‌రాబాద్‌ ఏప్రిల్ 20
మున‌క్కాయ చారు! మున‌క్కాయ ప‌ప్పు! మున‌క్కాయ ట‌మాటా! ఇలా మున‌క్కాయ‌లను ఎన్నో ర‌కాలుగా వంట‌ల్లో ఉప‌యోగించుకోవ‌చ్చు! అంతేగాదు, మున‌క్కాయ‌ల‌తో చేసిన ఏ వంట‌క‌మైనా ఎంతో రుచిగా ఉంటుంది. రుచితోపాటు మున‌క్కాయ‌ల్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు కూడా ఉంటాయి. అయితే, ఆ పోష‌కాలు మున‌క్కాయ‌ల్లో కంటే మున‌గాకులో ఇంకా ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మున‌గాకును ఆకు కూర‌గానో, ప‌ప్పులో క‌లెగూర‌గానో లేదంటే ప‌చ్చ‌డిగానో చేసుకుని తిన‌డంవ‌ల్ల ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుందని అంటున్నారు. మ‌రి మున‌గాకు చేసే మేలు ఎంతో తెలుసుకుందామా..!
*వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
*పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా కాపాడుతాయి.
*మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువ‌ల్ల మున‌గాకును నిత్యం వాడ‌టంవ‌ల్ల అతిగా తిన‌డం అనే స‌మ‌స్య తీరుతుంది.
*మునగాకులోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అమైనో ఆమ్లాలు ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
*మున‌గాకులో ఉండే క్లోరోజెనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

Related Posts