న్యూఢిల్లీ ఏప్రిల్ 20
విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి రాయ్‌టర్స్‌కు వెల్లడించారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై విధించే 10 శాతం కస్టమ్స్ డ్యూటీని ఎత్తేయాలని అనుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారు. ఇప్పటికే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు త్వరలోనే ఇండియాకు రానున్నాయి. అంతేకాదు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌ల వ్యాక్సిన్లను కూడా దేశంలో అందుబాటులోకి తేవాలని ఆ సంస్థలను ప్రభుత్వం కోరింది.అంతేకాదు ప్రభుత్వ జోక్యం లేకుండా దేశంలోని ప్రైవేటు సంస్థలే అనుమతి పొందిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. ధరల విషయంలోనూ వాళ్లకే స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్లపై ప్రభుత్వ నియంత్రణ ఉంది.