YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈ ఏడాది చివ‌రిలోపు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టనున్న కరోనా వైర‌స్

ఈ ఏడాది చివ‌రిలోపు  కాస్త త‌గ్గుముఖం ప‌ట్టనున్న కరోనా వైర‌స్

న్యూఢిల్లీ ఏప్రిల్ 20
ఈ ఏడాది చివ‌రిలోపు వైర‌స్ కాస్త త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని, వ‌చ్చే ఏడాది తొలి అర్ధ‌భాగం ముగిసే వ‌ర‌కు మ‌నం కాస్త ఊపిరి పీల్చుకోవ‌చ్చ‌ని ఎయిమ్స్ చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. అయితే ఇది జ‌ర‌గాలంటే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలి. క‌రోనా కొత్త వేరియంట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అర్థం చేసుకోవాలి అని ర‌ణ్‌దీప్ స్ప‌ష్టం చేశారు. ఓ న్యూస్  చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొత్త వేరియంట్ల‌పై చాలా వేగంగా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల‌ని ఆయన నొక్కి చెప్పారు. భ‌విష్య‌త్తులో ఈ మ‌హ‌మ్మారి ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో, మ‌నం దానిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి. వ్యాక్సినేష‌న్ అయినా, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మ‌నం వ్య‌వ‌హ‌రించే తీరు అయినా, కొత్త యాంటీ వైర‌ల్ డ్ర‌గ్స్ అభివృద్ధి చేయ‌డం అయినా ప్ర‌స్తుతం మ‌నం వైర‌స్‌తో చెస్ ఆడుతున్నాం. మ‌నం ఒక ఎత్తు వేస్తే అది మ‌రొక ఎత్తు వేస్తోందని, ఈ ఏడాది చివ‌రిలోపు ఎవ‌రు గెలుస్తారో చూద్దాం అని ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు.

Related Posts