YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురాముడిపై వైసీపీ సీరియస్

రఘురాముడిపై వైసీపీ సీరియస్

విజయవాడ, ఏప్రిల్ 21, 
వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అతి చేస్తున్నారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆయన తెగించినట్లే కనపడుతుంది. జగన్ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేయడం పై వైసీపీ సీరియస్ గా ఉంది. రఘురామ కృష్ణంరాజును ఉపేక్షించే కొద్దీ ఇంకా చెలరేగిపోతారని భావిస్తుంది. మరోసారి స్పీకర్ ను కలసి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరనున్నట్లు సమాచారం.అయితే బీజేపీ ఆలోచనగా కూడా వేరే గా ఉంది. రఘురామ కృష్ణంరాజు బీజేపీకి చేరువయ్యారు. ఆర్ఎస్ఎస్ నేతలను కూడా కలుస్తున్నారు. ఒక రకంగా బీజేపీ లో ఆయన అనధికారికంగా ఉన్నట్లే. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి పాలయినా నర్సాపురం పార్లమెంటు ఎన్నికలకు ఉప ఎన్నికను తీసుకురావాలన్నది పార్టీ రాష్ట్ర నేతల ఆలోచనగా ఉంది. తిరుపతి లో ఓటమి పాలయినా బలాన్ని నర్సాపురంలో చూపించుకోవాలని వారు భావిస్తున్నారు.నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ, జనసేన బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ జనసేన అభ్యర్థి నాగబాబుకు రెండు లక్షల ఓట్లు పైగానే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బలహీనమయిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తిరుపతి లో విజయం వైసీపీకి దక్కినా వారికి ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండనివ్వకుండా ఉండేందుకు రఘురామ కృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించే నర్సాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే మంచిదని భావిస్తున్నారు.రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ కూడా సీిరియస్ గా ఉంది. ఆయన మాటల క్లిప్పింగ్ లను ఇప్పటికే తీసి పెట్టుకున్న వైసీపీ తిరుపతి ఉప ఎన్నిక తర్వాత మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తుంది. పార్టీ సభ్యుడిగా ఉంటూ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా పిటీషన్ వేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇటు బీజేపీ ఆలోచన కూడా ఇలాగే ఉండటంతో రఘురామ కృష్ణంరాజు విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశముందంటున్నారు.

Related Posts