YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏసీ కోచ్ లలో క్వారంటైన్

 ఏసీ కోచ్ లలో క్వారంటైన్

విశాఖపట్టణం, ఏప్రిల్ 21, 
కరోనాపై పోరాటంలో తమవంతు సహాయ సహకారాలను అందించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా స్లీపర్‌క్లాస్, ఏసీ కోచ్‌లను క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులుగా మార్పులు చేస్తోంది. ప్రాథమిక దశలో 5వేల కోచ్‌లను ఈ విధంగా మార్పులు చేసేందుకు ఇండియన్‌ రైల్వే శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వారంరోజుల్లో వాల్తేర్‌ డివిజన్‌ 60 కోచ్‌లలో 500 ఐసోలేషన్‌ పడకలను తయారుచేసింది. వాల్తేర్‌ డివిజన్‌. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ చేతన్‌కుమార్‌ శ్రీ వాస్తవ పర్యవేక్షణలో వాల్తేర్‌ డివిజన్‌ కోచింగ్‌ డిపో సిబ్బంది ఈ తరహా పడకలు తయారుచేయడంలో ముందున్నారు.అన్ని స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లలో ఉండే మధ్య బెర్తులు (మిడిల్‌ బెర్తులను) తొలగించారు.ప్రతీ బేలో కేవలం ఒక బెడ్‌ చొప్పున కోచ్‌కు 9 వార్డులను రూపొందించారు. కోచ్‌లలో ఉండే నాలుగు టాయ్‌లెట్లలో ఒకదానిని బాత్‌రూమ్‌గా మార్చారు. కోచ్‌లలో ఉండే 6 వాష్‌బేసిన్ల వద్ద లిక్విడ్‌ సోప్‌ డిస్పెన్సర్స్‌ ఏర్పాటుచేశారు. ప్రతీ బే వద్ద నాలుగు బాటిల్‌ హోల్డర్స్‌ (సెలైన్‌ బాటిల్స్‌ కోసం) ఏర్పాటుచేశారు. ప్రతీ కూపే వద్ద పెడల్‌ ఆపరేటెడ్‌ డస్ట్‌బిన్లు ఏర్పాటుప్రతీ బాత్‌రూం బకెట్, మగ్‌ అందుబాటులో ఉంచారు. ప్రతీ కోచ్‌లోను మెడికల్‌ సిబ్బందికి, వైద్యులకు ప్రత్యేకంగా మూడు కర్టెన్లు ఏర్పాటు. అన్ని కోచ్‌లలో ఆక్సిజన్‌ సిలిండర్‌ స్టాండ్లు అమరిక.అన్ని కోచ్‌లలో దోమతెరల ఏర్పాటు అన్ని కోచ్‌లలో ఆధునాతన శానిటైజేషన్, డిజిన్‌ఫెక్షన్‌ పరికరాలతో కూడిన క్లీనింగ్‌కు సిబ్బంది. అందుబాటులో మాస్క్‌లు, పీపీఈలు, శానిటైజర్లు వినియోగిస్తున్నారు.

Related Posts