YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇరుదేశాల భేటీపై అందరి దృష్టి

ఇరుదేశాల భేటీపై అందరి దృష్టి

ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు ఆయనతో కలసి సేదదీరుతున్నారు. గత రాత్రి ఆయన చైనీస్ ప్రావిన్స్ ఆఫ్ హుబేయ్ రాజధాని వూహాన్ కు చేరుకోగా, నేటి సాయంత్రం వీరిద్దరి సమావేశం జరగనుంది. ఇక స్థానిక మ్యూజియం వద్ద కలిసిన ఇద్దరు నేతలూ, పలకరింపుల తరువాత నగరంలోని ఓ సరస్సు వద్దకు విహారానికి వెళ్లారు. కాసేపు కలసి నడుస్తూ కబుర్లు చెప్పుకున్న అనంతరం, బోట్ రైడింగ్ చేశారు.కాగా, ప్రతి దేశం నుంచి ఆరుగురు చొప్పున దౌత్యాధికారులతో రెండు రౌండ్ల పాటు సమావేశాలు జరగనుండగా, వీటికి ఇరు దేశాధినేతలూ హాజరు కానున్నారు. ఆ తరువాత సెంట్రల్ వుహాన్ లోని ఈస్ట్ లేక్ గెస్ట్ హౌస్ లో మోదీ గౌరవార్థం జిన్ పింగ్ విందును ఏర్పాటు చేశారు. ఆపై శనివారం ఇద్దరి మధ్యా మరోసారి చర్చలు సాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గత సదస్సుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల అమలు, రెండు దేశాల మధ్యా వ్యాపార, వాణిజ్య బంధాలు, సరిహద్దుల్లో పరిస్థితులతో పాటు ఎకనామిక్ కారిడార్ తదితర అంశాలూ ప్రస్తావనకు రానున్నాయి.

Related Posts