వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పోటీపడు తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్ ఉదృతం గా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు వ్యాక్షిన్ కోసం ఎగబడుతున్నారు. నిన్న మొన్నటి దాకా వ్యాక్సిన్ వేయించుకోండి.. అపోహలు వద్దు అంటూ అధికారులు అవగాహన కల్పిస్తే తప్ప వ్యాక్సిన్ వేయించుకోవ డానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండ డంతో జనం వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రిల వద్ద క్యూలు కడుతున్నా రు.తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద అయితే అంతకు మించి అన్నట్టు ఉంది పరిస్థితి.కరోనా నిబంధనలు పక్కనపెట్టి వ్యాక్సిన్ కోసం గుంపులు గా ఎగబడుతున్నారు.అధికారులు దీనిపై దృష్టి సారించి ఒక క్రమ పద్ధతిలో ప్రజలు వ్యాక్సిన్ వేయించు కునేలా చర్యలు తీసుకోకపోతే ఆసుపత్రుల సాక్షిగా కరోనా విజృంభించే ముప్పు పొంచి ఉంది.