YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

అన్ని పరీక్షలు రద్దు చేయాలి

అన్ని పరీక్షలు రద్దు చేయాలి

విజయవాడ
కరోనా సెకండ్ వేవ్ పట్ల  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమై నివారణకు చర్యలు చేపడితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏపీలో అసలు కరోనానే లేదన్నట్లు వ్యవహరిస్తూ పాలన గాలికొదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు: విజయవాడ పార్లమెంటు టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ  రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా  విజృంభిస్తున్నా ప్రభుత్వం  కరోనా నివారణపై తీసుకున్న చర్యలు శూన్యం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు  వందల సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఒక్క రోజే ముగ్గురు ఉపాధ్యాయులు చనిపోయారు. హాస్పిటల్స్ లో  వ్యాక్షిన్ లేదు, రోగులకు సరిపడా మందులు, బెడ్లు లేవు. పరిస్థితులు ఈ విధంగా ఉంటే జగన్ రెడ్డి మాత్రం కరోనా నివారణ చర్యలు గాలికొదిలి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించి  స్కూల్స్, కాలేజీలు మూసివేశారు, ఇప్పటికే పలు బోర్డ్ ఎగ్జామ్స్ ను కూడా రద్దు చేసాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సిస్సిఇ) బోర్డు కొద్ది రోజుల క్రితం దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో 10వ, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
కానీ ఏపీలో మాత్రం 10 వతరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రద్దు చేయకపోగా కనీసం ఆ విద్యార్థులకు సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. పదవ తరగతి విధ్యార్దుల యొక్క నిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా వెనువెంటనే పరీక్షలు రద్దుచేయాలని అన్నారు.
పరీక్షలు రద్దు చేయకుండా ఎవరి ప్రయోజనాల కోసం  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 10 వతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే రద్దు చేసి విధ్యార్దుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నామని అన్నారు.

Related Posts