YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా  కేసులు

కర్నూలు
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో బుధవారం నాడు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ భేటీలో  కోవిడ్ కట్టడి చర్యలు, కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీలు, మునిసిపల్ కమీషనర్, జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ, ప్రభుత్వ, ప్రవేట్ కోవిడ్ ఆసుపత్రుల సూపర్ఇంటెండెంట్స్ తో  మంత్రి  సమీక్ష నిర్వహించారు.  జిల్లాలో కోవిడ్ స్థితి గతులు, కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమానికి  నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్,  హఫీజ్ ఖాన్, డా.జె. సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జిల్లా అధికారులు  హజరయ్యారు.

Related Posts