YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇంటి పనివారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ

ఇంటి పనివారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ

నౌకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం....గృహావసర కార్మికులకు జాతీయ విధానం తో సామాజిక భద్రతతో పాటు, మెటర్నిటి సెలవలు, వృధ్ధాప్య పింఛన్లు వంటి భరోస ప్రభుత్వం కల్పిస్తుంది...ఇళ్లలో పనిచేసే నౌకర్లకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్రమండలిని ఏర్పాటు చేస్తుంది. ఈ మండలి ద్వార దేశహ్యప్తంగా 65 లక్షల మంది పనిమనుషులకు సామాజిక భద్రత లభించనుంది. అమల్లోకి వస్తే..మెదట పనిమనుషులకు ప్రత్యేక కేంద్ర మండలి ఏర్పాటవుతుంది. నౌకర్లు, డ్రైవర్లు, గృహఅవసరాలు తీర్చి ఇతర పనివారు, యజమానులు ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలి. నౌకర్లు, పూర్తిస్థాయి పనివారు, తాత్కాలిక పనివారు, ఇళ్లలోనే ఉంటూ పనిచేసేవారు, యజమానులను పూర్తిగా ఈ మండలి నిర్వహిస్తుంది.కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ మండలి అమల్లోకి వస్తే, ఇళ్లలో సహయకులుగా పనిచేసే సుమారు 32 లక్షల మంది ఆడవాళ్లకు యజమానుల నుండి జరిగే వేధింపులను కట్టడి చేస్తుంది. అలాగే డ్రైవర్లగా పనిచేసేవారికి కుడా వారి యజమానుల నుండి జరిగే ఆగడాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ మండలి ద్వారా యజమానులైన, కార్మికులైన తమకున్న సమస్యను మండలి లో ఫిర్యాదు చేయవచ్చు. మండలి కమిటి, సమస్యను పరీసీలించి తగు పరిష్కారాన్ని చూచిస్తుంది.  కార్మికులకు శ్రమకు తగిన వేతనం లభిస్తుంది. తమ జీతం నేరుగా భ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. వారు పనిచేసే ప్రదేశాలలో పరిస్థతులు మెరుగుపడతాయి. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకం క్రింద  ఆరోగ్య భీమా, మెటర్నిటి సెలవులు, వృధ్థాప్య పించన్లు వంటి ప్రయోజనాలు కలుగుతాయి.ఈ పధకం ద్వారా దేశంలో దాదపు 32 లక్షల మహిలా పనిమనుషులకు, 33 లక్షల మంది సహాయకులుగా, డ్రైవర్లుగా పనిచేసే వారికి ఉరట కలుగుతుంది.

Related Posts