YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

రాజస్థాన్‌ సబ్‌ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు

రాజస్థాన్‌  సబ్‌ జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు

జైపూర్‌ ఏప్రిల్ 21
రాజస్థాన్‌లోని బికనేర్‌ లోని నోఖా సబ్‌ జైలు నుంచి ఖైదీలు పరారయ్యారు. మంగళవారం అర్ధరాత్రి వీరు జైలు గోడలు దూకి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. 15 రోజుల క్రితం ఫలోడి జైలు నుంచి కూడా ఖైదీలు పారిపోయారు. తప్పించుకున్న ఖైదీల్లో సురేష్ కుమార్, సలీం ఖాన్, మన్‌దీప్ సింగ్, రత్న, అనిల్ పండిట్ ఉన్నారు.బికనేర్‌లోని నోఖా సబ్‌ జైలు నుంచి ఐదుగురు అండర్‌ ట్రయల్‌ ఖైదీలు తప్పించుకున్నారు. వీరు పారిపోయిన విషయాన్ని జైలు సిబ్బంది అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత గుర్తించారు. దాంతో పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. కానీ ఇప్పటివరకు పరారీలో ఉన్న ఖైదీల గురించి ఎటువంటి ఆధారాలు దొరుకలేదు.జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తప్పించుకున్న ఖైదీలలో హనుమన్‌గఢ్‌‌కు చెందిన ముగ్గురు, హర్యానాకు చెందిన ఒకరు, నోఖాలోని జస్రసర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఒకరు ఉన్నారు. ఈ ఖైదీలు మొదట తమ సెల్ గోడను పగులగొట్టి, ఆపై కిటికిని పగలగొట్టి బయటకు వచ్చారు. అనంతరం సిద్ధం చేసుకున్న దుప్పటి తాడు సాయంతో గోడపైకి ఎక్కి అక్కడి నుంచి బయటకు దూకి తప్పించుకున్నారు.ఖైదీలు పారిపోయిన సమాచారం అందగానే అదనపు పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) సునీల్ కుమార్ నాయకత్వంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. హనుమన్‌గఢ్‌ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. నోఖా సీఐలు నేమ్ సింగ్, అరవింద్ సింగ్ కూడా బృందాలను ఏర్పాటు చేసి ఖైదీల కోసం వెతుకుతున్నారు. మొత్తం జిల్లాలో దిగ్బంధనం కొనసాగిస్తున్నారు.

Related Posts