YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అండ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అండ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలము లో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన టీచర్లకు నెలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం తో పాటు కుటుంబానికి  25 కిలోల  చొప్పున సన్న బియ్యం ని  పంపిణీ  చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోన్ కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పడుతున్న బాధలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షా 25 వేల మంది మంది ప్రైవేటు  ఉపాధ్యాయులను గుర్తించి వారి అకౌంట్ లో 2000 జమ చేయడం జరిగిందని మంత్రి అన్నారు. మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. 2900 ల మెట్రిక్ టన్నులు సన్నబియ్యం ప్రతినెల అవసరం పడుతుందని టీచర్ల అవసరమైన 31 కోట్ల రూపాయలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగిందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుండి బయటపడాలని మంత్రి ఆకాంక్షించారు. 

Related Posts