YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

తూత్తుకుడిలో రూ.1,500 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

తూత్తుకుడిలో రూ.1,500 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

చెన్నై ఏప్రిల్ 21
 తూత్తుకుడిలో రూ.1,500 కోట్ల విలువైన కొకైన్‌ను భారత అధికారులు పట్టుకున్నారు. ఓ ఓడలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. ఈ దాడులు కేంద్ర రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్తికేయన్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ఓడలో ఉన్న 6 అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.తమిళనాడుకు చెందిన తూత్తుకుడి డబ్ల్యూఏసీ ఓడరేవు ద్వారా డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ విభాగానికి రహస్య సమాచారం అందింది. దీనిని అనుసరించి తూత్తుకుడికి వచ్చే కంటైనర్లను డీఆర్‌ఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కలపను బ్రెజిల్ నుంచి తూత్తుకుడిలోని ఒక సంస్థకు దిగుమతి చేసుకున్నారు. కలపను కంటైనర్లలో ప్యాక్ చేసి పనామాకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కలపతో కూడిన 8 కంటైనర్లు నిన్న తెల్లవారుజామున శ్రీలంక మీదుగా తూత్తుకుడికి వచ్చాయి.ఆ సమయంలో సెంట్రల్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందం బోటులో ఉన్న 8 కంటైనర్ బాక్సులను స్వాధీనం చేసుకున్నది. ఈ కంటైనర్‌లలో కలప రవాణా మాటున మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. కంటైనర్లను పరిశీలించగా.. 300 కిలోల కొకైన్ అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.గత ఏడాది నవంబర్‌లో కూడా 100 కిలోల కొకైన్‌ను ఇదే తూత్తుకుడి డబ్ల్యూసీఏ ఓడరేవులోనే కేంద్ర రెవెన్యూ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో శ్రీలంక జాతీయులైన తొమ్మిది మంది బోటు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఓడరేవు నుంచి తరుచుగా మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్తున్నారు.

Related Posts