నెల్లూరు
రాష్ట్రములో కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా 5 గురు మంత్రులతో కోవిడ్ నివారణకు ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది.
కోవిడ్ కేసులు ఎక్కువగా నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు.కరోనా నివారణకు ముందోస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇంచార్జి డీఎంహెచ్వో డాక్టర్ స్వర్ణలత ను మంత్రి ఆళ్ల నాని బుధవారం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 3097యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయనే విషయాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణలతతో బుధవారం ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో 12కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు.నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న 561మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అని తెలియజేశారు. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు అవసరం అయినమందులు,ఆహారం అందించాలని సూపరింటెండెంట్ ను ప్రత్యేకంగా మంత్రి ఆదేశించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని కోవిడ్ హాస్పిటల్స్ వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి అని పేర్కొన్నారు. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు గూడూరు, ఆత్మకూరు, కావలి ఏరియా హాస్పిటల్స్ లో కూడ కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నాం అని చెప్పారు. ఒక్క నెల్లూరులోనే 8 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడ కోవిడ్ పెషేంట్స్ కోసం బెడ్స్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ 8 వందలు మంది చికిత్స పొందుతున్నారు అని తెలిపారు.మిగిలిన వారందరు హోమ్ ఐసోలేషన్ వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయల్లో, వ్యాపార సముదాయలు వద్ద నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని చోట్ల ధర్మల్ గన్స్, శానిటేజర్స్ ఉంచామన్నారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 3,500వరకు ఆర్ టీ పి సి ఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అని తెలియజేశారు. అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కు నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు నెల్లూరు జిల్లా లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.