హైదరాబాద్ ఏప్రిల్ 21
కరోనా వేళ పాలతో పాటు కాస్త మంచి పసుపు జోడిస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి.రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లోనూ తేలింది. అలాంటి సుగుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభించినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు.