YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తా (రివైజ్డ్) దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా దేశ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయి నాయకుల్లో అవగాహన శక్తి లేకనే ఈ దుర్భర పరిస్థితి నెలకొని ఉంది తన ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి ఫ్ర

హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తా (రివైజ్డ్) దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా దేశ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయి నాయకుల్లో అవగాహన శక్తి లేకనే ఈ దుర్భర పరిస్థితి నెలకొని ఉంది తన ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి ఫ్ర

పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు అంకురార్పణ లక్ష్యాలతో హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అద్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేశారు. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు ‘తెలంగాణ ప్రగతి వేదిక’గా నామకరణం చేశారు.  ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు.. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం. తెలంగాణ ప్రజల దీవెనలు.. ఆశీస్సులతో ముందుకు పోతాం. ఈ గులాబీ పరిమళాలను దేశంలోని మారుమూల గ్రామాల్లోకి తీసుకుపోతాం. ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. కావాల్సినన్ని వనరులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి. అద్భుతమైన నదులు, భూములు ఉన్నాయి. కానీ నాయకుల్లో అవగాహన శక్తి లేకనే ఈ దుర్భర పరిస్థితి నెలకొని ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం పెరగాలన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాలి. బాధ్యత గల రాష్ట్రంగా దేశం బాగు కోసం ఉద్యమిస్తామన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్ ఉద్ఘాటించారు.దేశ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసం చేస్తున్నాయి. రాష్ర్టాలనుమున్సిపాలిటీలకంటేహీనంగాచూస్తున్నారు.వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టాణాభివృద్ది, తాగునీటి వసతి,ఆరోగ్యం కేంద్రం వద్ద ఎందుకు అని నిలదీశారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన.. మీకు అవసరమా. రోడ్లు వేసేందుకు సర్పంచ్, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ లేదా అని ప్రశ్నించారు. నరేగా కూలీలకు పోస్టాఫీసులో వేసే దుస్థితి నెలకొని ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన పారదర్శకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నీతి, నిజాయితీగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఉద్ఘాటించారు.టీఆర్‌ఎస్ పార్టీని, ఉద్యమాన్ని ప్రారంభించి 17సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2001 ఏప్రిల్ 27న పార్టీని ప్రారంభించాం. ఆ రోజు నుంచి అనేక సన్నివేశాలు, సందర్భాలు చూశాం. అందరి అంచానాలను తలకిందులు చేస్తూ.. అనుమానాలను పటాపంచలు చేశాం. అనేక గెలుపులు.. ఓటములు చవిచూశాం.. అద్భుతంగా తెలంగాణను సాధించుకున్నామని సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా. మళ్లీ తెలంగాణ గడ్డమీదనే అడుగుపెడుతానని చెప్పిన ఆత్మవిశ్వాసంతోనే చెప్పిన . ఆ తర్వాత కొందరు దీవెనలు ఇచ్చారు. కొందరు శాపనార్థాలు పెట్టిన వారు కూడా ఉన్నారు. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగినాము. తెలంగాణ ప్రజానీకం అద్భుతమైన మెజార్టీని తెచ్చిపెట్టింది. నీతిగా, నిజాయితీగా పని చేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. నిజాయితీగా పని చేసే ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని కేసీఆర్ స్పష్టం చేశారు.

సంక్షేమ ఫలాలను ప్రత్యక్షంగా ప్రజలు అనుభవిస్తున్నారు. పారదర్శకంగా ముందుకు పోతున్నాం. కొన్ని పనులు చేయాలంటే సాహసం కావాలి. ధైర్యం కావాలి. తండాలను పంచాయతీలుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా గిరిజనులు పోరాటం చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి కూడా అమలు చేయలేదు. 4 వేల పైచిలుకు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశాం. తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. పరిపాలనలో సంస్కరణలు తెచ్చేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మన పాలనను ప్రధాని సహా పలు రాష్ర్టాలు ముఖ్యమంత్రులు ప్రశంసించారు. 31 జిల్లాలతో తెలంగాణ అలరారుతోందన్నారు సీఎం కేసీఆర్.దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ఇటీవలే ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. ప్రధాని మోదీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే అందరికీ భయం.. కేసీఆర్ మొండి కదా.. అది భయం. కేసీఆర్ ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తాడు. అందుకే వారికి భయం. దేశం బాగు కోసం ఎంతకైనా పోరాడుతా నన్నారు.తెలంగాణను ఎట్ల అయితే తెచ్చి చూపిన్నో.. దేశం మంచి కోసం కూడా ఆ విధంగా పని చేస్తాను. ఎవ్వరికీ భయపడను. మీ అందరి సహకారంతో ముందుకు పోతాను. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల అసమర్థత పాలన వల్ల దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఈ పార్టీల కారణాంగానే నీటి కష్టాలు వచ్చాయన్నారు. దేశానికి ఎంతో కొంత తెలంగాణ నుంచి మేలు జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశంలో40 కోట్ల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తెలిపారు. మరో ఆరేడు ఏళ్లలో ఆ నీటిని ప్రతి ఎకరాకు అందే విధంగా ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్లే దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని, రైతాంగం సమస్యలను పరిష్కరించేందుకు బృహర్త ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రతి ఎకరాకు, ప్రతి పంటకు, ప్రతి రైతుకు నీరు అందించే విధంగా విధానాలను తయారు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రకృతిపరకంగా దేశానికి ఆ నీరు లభిస్తోందని, కానీ అందులో 40వేల టీఎంసీలను దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల సాగు భూమికి సరఫరా చేయవచ్చు అని కేసీఆర్ అన్నారు. ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం నీళ్లను పంచితే అన్ని రాష్ర్టాలకు 40వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. కానీ గత పాలకులు ఆ పని చేయలేదన్నారు. దేశ‌వ్యాప్తంగా 25వేల టీఎంసీల మిగులు జ‌లాలు ఉన్న‌ట్లు సీఎం చెప్పారు. 14 ఏళ్లు గ‌డిచినా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా నీటి వివాదాన్ని తేల్చలేకపోయిందన్నారు. రాష్ర్టాల మధ్య, ప్రాంతాల మధ్య యుద్ధాలు పెట్టి కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయన్నారు.పార్టీకి, ప్రభుత్వానికి నూతనోత్తేజం.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు అంకురార్పణ లక్ష్యాలతో హైదరాబాద్‌లోని కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు ‘తెలంగాణ ప్రగతి వేదిక’గా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్లీనరికి రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆటపాటలతో కళాకారులు అలరిస్తున్నారు.రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని తెరాస  ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ప్లీనరీ వేదిక కానుంది. ఇప్పటికే పార్టీ గ్రామ, మండల కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ  కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలే అధ్యక్షులుగా ఉంటారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఇతర సీనియర్‌ నేతలను నియమించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం ఇప్పటికే పునరుద్ఘాటించారు. దీనికి అనుగుణంగా ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వరప్రదాయినిగా తెరాస విశ్వసిస్తోంది. దీని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు నెలలకోసారి సర్వేలను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు లోటుపాట్లను సీఎం వివరిస్తున్నారు. 2019 ఎన్నికల బృందం ఇప్పటికే ఖరారైంది. ప్లీనరీ వేదికగా వీటన్నింటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్లీనరీని తెరాస  ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి ప్లీనరీ వేదిక కానుంది. ఇప్పటికే పార్టీ గ్రామ, మండల కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ  కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలే అధ్యక్షులుగా ఉంటారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, ఇతర సీనియర్‌ నేతలను నియమించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వని పక్షంలో ఎన్నికల్లో ఓట్లు అడగబోమని సీఎం ఇప్పటికే పునరుద్ఘాటించారు. దీనికి అనుగుణంగా ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వరప్రదాయినిగా తెరాస విశ్వసిస్తోంది.

Related Posts