YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు

రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు

 విదేశీ గడ్డ పై  అధికార పర్యటన చేస్తూ..

స్విట్జర్లాండ్  లో మంత్రి కేటీర్    వ్యాఖ్యల పై టీపీసీసీ ఎన్నారై సెల్ ఖండన 

మంత్రి కే   రామరావు  విదేశీ గడ్డ పై  అధికార పర్యటన చేస్తూ రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు .   వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు  కు ప్రజల పన్నుల సొమ్ము తో అధికార పర్యటన కు వచ్చి  తెరాస పార్టీ  శాఖా లు అంటూ పార్టీ కార్యక్రమాలు  ఆవిష్కరణ చేయడం ,రాజకీయాలు మాట్లాడటం  కేటీర్  అపరిపక్వత ను తెలియచేస్తుంది .  విద్యుత్తూ పై  కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అని స్థలం ,సందర్భము  లేకుండా మాట్లాడటాన్ని టీపీపీసీ  ఎన్నారై సెల్  యూక్ & యూరప్   తీవ్రంగా ఖండిస్తోంది . విద్యుత్తూ పై కాంగ్రెస్ పార్టీ చర్చ కు సిద్ధం అవ్వగా చర్చ కు రాకుండా పారిపోయింది  తెరాస పార్టీ నే కదా అని   కాంగ్రెస్ పార్టీ  దశాబ్ద కాలం లో దీర్ఘ కాళికా ప్రయోజనాల తో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ల వల్లే నేటి విద్యుత్తూ అని ,  3 ఏండ్ల  పసిగుడ్డు ప్రభుత్వం అని చెప్పుకునే తెరాస  విద్యుత్తూ   సాధించింది అని చెప్పేది  ప్రజలు నమ్మరని టీపీసీసీ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్ అన్నారు . 

ముఖ్యమంత్రి జిల్లా  ఆకునూర్ లో   ఉప ఎన్నిక ఎంపీటీసీ ని  గెలిపించుకోలేక పోయిన మీరు కాంగ్రెస్  విజయాల గురించి మాట్లాడటం  అస్యాస్పదం అని   వేణుగోపాల్ అన్నారు 

4 ఏండ్లు  కావస్తున్నా ఎన్నారై పాలసీ  ఏర్పాటు కాలేదు .  రాజకీయాలు పక్కన పెట్టి ముందు పాలసీ ప్రకటించాలని రంగుల సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు ప్రభుత్వ అధికారిక కార్య క్రమాలకు ప్రజల సొమ్ము తో  స్విట్జర్లాండ్   వచ్చిన  మీరు ప్రభుత్వ అధికారి     IT సెక్రెటరీ జేయేష్ రంజన్   సమక్షం లో  తెరాస పార్టీ సభ లో మాట్లాడినట్లు మాట్లాడటం  మీ అవివేకం ఐతుంది  అని టీపీసీసీ ఎన్నారై సెల్  సంయుక్తం గా విడుదల చేసిన పత్రిక ప్రకటన లో తెలిపారు . 


 

Related Posts