YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

15 ఏళ్లు..పుతిన్

15 ఏళ్లు..పుతిన్

మాస్కొ, ఏప్రిల్ 22,
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత స్ట్రాంగ్ అయ్యారు ఇటీవల వచ్చిన కొత్త చట్టంతో ఆయన మరో 15 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా పుతిన్ కొనసాగనున్నారు. అంటే రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 2036 వరకూ ఉంటారన్న మాట. ప్రస్తుతం పుతిన్ వయసు 68 ఏళ్లు. అంటే మరో పదిహేనేళ్లు… 83 ఏళ్ల వరకూ ఆయన రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పటికే రష్యాలో పుతిన్ రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు.రాజ్యాంగ సవరణతో పుతిన్ అధ్యక్ష పదవీకాలాన్ని పెంచుకోగలిగారు. గత ఏడాది రష్యాలో రాజ్యంగ సవరణపై ప్రజాభిప్రాయాన్ని నిర్వహించారు. దాదాపు అత్యధిక శాతం మంది ప్రజలు పుతిన్ ను పదవిలో కొనసాగడానికి మద్దతు పలికారు. రాజ్యంగ సవరణ కు మద్దతుగా దాదాపు 76 శాతం మంది ప్రజలు మద్దతు పలకడంతో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ 2036 వరకూ కొనసాగే అవకాశం లభించింది.రష్యా అధ్యక్ష బాధ్యతలను పుతిన్ 2000 సంవత్సరంలో చేపట్టారు. 2008 నాటికి పదవీ కాలం పూర్తయినా తర్వాత ప్రధాని అయ్యారు. అనంతరం రష్యా అధ్యక్షుడి పదవీ కాలాన్ని నాలుగేండ్ల నుంచి ఆరేళ్లకు పెంచారు. 2012లో పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఇక్కడి నుంచి పుతిన్ వెనుదిరిగి చూసుకోలేదు. అధ్యక్షుడి పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను సిద్ధం చేసి రాజ్యాంగ సవరణ చేసి తనకు అనుకూలంగా మలచుకున్నారు.నిజానికి పుతిన్ పదవీకాలం 2024లో పూర్తవుతుంది. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా తనకు అనుకూలంగా మలిచారు. పుతిన్ మరో పదిహేనేళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉండటంతో రష్యా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ఇకపై స్ట్రాంగ్ ఉండబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద విపక్షాలను దెబ్బకొడుతూ పుతిన్ రష్యాలో మరింత బలోపేతమయ్యారు.

Related Posts