హైద్రాబాద్, ఏప్రిల్ 22,
ఇది చాలా విపత్కర పరిస్థితి. కరోనా సెంకడ్ వేవ్ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మీ కుటుంబంలోనే ఎవరైనా వైరస్ బారిన పడితే వారి పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకందాం. సాధరణంగా ఈ కరోనా బారిన పడినప్పుడు పూర్తిగా ఐసోలేషన్‌లో ఉండాలి. కానీ, మన ఇంట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. మీ భాగస్వామి లేదా మీ పిల్లల్లో ఎవరైనా ఈ మహమ్మారి బారిన పడినపుడు ఒక ఇంట్లో మనం ఉండాల్సి ఉంటుంది. వారికంటూ ప్రత్యేక గదిని కేటాయించలేని పరిస్థితి కూడా ఏర్పాడవచ్చు , పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరూ ఆస్పత్రిలో జాయిన్ అయ్యే అవసరం ఉండదు. పాజిటివ్ వచ్చినపుడు కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న సమయంలో భయాందోళనకు గురవ్వడం సాధరణమే.. అయినా కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి. మీ ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకుంటూనే, వైరస్ బారిన వారిని కూడా చికిత్స అందించవచ్చు.కొన్ని చేయాల్సిన, చేయకూడని నియమాలు ఏంటో మనం తెలుసుకందాం. దీన్ని డాక్టర్ బెహ్రన్ పార్దివాలా అనే వైద్యుడు ఇచ్చిన సూచనల మేరకు కేర్ గివర్స్‌పై పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. కరోనా బారిన పడిన వ్యక్తి దుస్తులను విడిగా ఉతకాలి. క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ప్రత్యేక టాయిలేట్ సదుపాయం లేకుండా, కామన్ వాష్‌రూం ఉంటే తరచూ క్రిమిసంహారక పిచికారీతో శుభ్రం చేస్తూ ఉండాలి.రోగి వాడిన పడేసిన వస్తువులను ప్రత్యేకమైన పసుపు రంగు బయో హజర్డాస్ బాక్స్‌లో వేయాలి.కరోనా బారిన పడిన వ్యక్తి గదిలోకి ఇతన కుటుంబసభ్యులు నేరుగా ప్రవేశించకూడదు. ఎందుకంటే ఆ గది పూర్తిగా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల వైరస్ ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. మీ చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవాలి. భోజనానికి ముందు సబ్బుతో కడగాలి. వ్యాధి బారిన పడిన వ్యక్తి వాడే వస్తువులను ప్రత్యేకంగా పెట్టాలి. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా బయటి వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకోవాలి.