రాజమహేంద్రవరం
స్థానిక నారాయణపురం లో రక్తం ఓడుతున్న గోమాతలను, రాజమాహేంద్రవరం పార్లమెంట్ జిల్లా మాజీ అధ్యక్షులు బర్ల బాబూరావు పరిశీలించి ఈ దుష్ట చర్యలను ఖండించారు. కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని సంఘ విద్రోహ శక్తులు పన్నిన కుట్ర లేక ఏదైనా వ్యాధి కారణమా అన్నది పశు వైద్య అధికారులు, పోలీసులు తెలియజేయాలని, ఎందుకు అంటే రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు, ఆలయ రథములు తగలబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం చూసాం వచ్చే రోజుల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న సందర్భంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎవరైనా కుట్ర చేశారా అని అనుమానం కలుగుతుంది ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి అలాంటి చర్యలు జరిగి ఉంటే సంఘ విద్రోహ శక్తులను ఎంతటి వారైనా కటకటాల వెనక్కి పంపించాలి నోరులేని మూగజీవాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.. అనంతరం ఘటనకు సంబంధించి కాకినాడకు చెందిన ఒక ప్రత్యేక వెటర్నిటీ వైద్య బృందం వచ్చి గోవులను పరిశీలించి వాటివద్దనుంచి శ్యాంపెల్స్ తీసుకుని దీనిమీద ప్రత్యేక వివరాలు సేకరించి, వివరాలను తెలియజేస్తామని అన్నారు.