YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర ప్రభుత్వం గడువు తిరస్కరించిన సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం గడువు తిరస్కరించిన సుప్రీంకోర్టు

కావేరీ జల పంపిణీ పథకాన్ని రూపొందించేందుకు రెండు వారాలపాటు గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కోరింది. వచ్చే నెల 3 నాటికి ఓ పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తిరస్కరించారు. తమ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ తీర్పు ప్రకారం పథకాన్ని రూపొందించవలసిన కర్తవ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఎంతో అధ్యయనంచేసి, శ్రమకోర్చి ఈ తీర్పునిచ్చినట్లు తెలిపారు. ఇప్పటికీ దీనిని అనుసరించి పథకాన్ని రూపొందించడంపై దృఢ నిశ్చయం కనబరచడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గడువు పెంపుపై కేంద్ర ప్రభుత్వ దరఖాస్తును వచ్చే నెల 3 న పరిశీలిస్తామని తెలిపారు.తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల పంపిణీపై ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని ప్రకారం నీటి పంపకాల కోసం ఓ పథకాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ నెల 9న ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. 200 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ వివాద పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వానికి దృఢ నిశ్చయం ఉందో, లేదోనని సందేహం వ్యక్తం చేసింది.

Related Posts