YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలా

వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఇలా

హైదరాబాద్, ఏప్రిల్ 22,
దేశంలో అత్యవసర వినియోగం కింద కోవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం.. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. తొలి దశలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు, తర్వాత 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు, 45 ఏళ్లు నిండి అనారోగ్య సమస్యలున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పూర్తయినవారికి వ్యాక్సినేషన్ మొదలుపెట్టగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.48 గంటల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టీకా తీసుకోవాలనుకునే వాళ్లు ముందుగా తమ పేర్లను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి, తేదీని నిర్ణయించుకోవచ్చు. దగ్గరలోని టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవచ్చు.దేశంలో 18 ఏళ్లు దాటినవారి సంఖ్య 80 నుంచి 90 కోట్ల వరకు ఉంటుంది. వీరిలో 45 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఇప్పటి వరకూ దేశంలోని 13 కోట్ల మందికి కనీసం ఒక్క డోస్ టీకా వేశారు. అలాగే, మరో 500-600 మిలియన్ల మంది టీకా కోసం నమోదుచేసుకున్నారని వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షించే కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. టీకా కొరత ఎదుర్కొంటున్నట్టు రాష్ట్రాలు ఇటీవల ఫిర్యాదు చేస్తుండగా.. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ప్రారంభమైతే మరిన్ని ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. జులైలోపు అనుకున్న సంఖ్యలో టీకాలను అందజేయడం కష్టమని వ్యాక్సిన్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
కోవిన్ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ ఇలా....
మొదట కోవిన్ వెబ్‌సైట్  లో లాగిన్ అయి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి.. ఆ తర్వాత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ క్లిక్ చేయాలి.. ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది. ఈ పేజ్‌లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి, ‘రిజిస్టర్’ బటన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. టీకా వేయించుకునేందుకు తేదీని ఎంపికచేసుకునే సౌలభ్యం ఉంటుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి. పిన్‌కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే మీ పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా ప్రదర్శితమవుతుంది.. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది

Related Posts