YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

జగన్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

విజయవాడ, ఏప్రిల్ 22, 
ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్‌ నియంత్రణ చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయకపోవటంపై సీరియస్ కామెంట్స్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో తోట సురేష్‌ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని.. ప్రాధాన్యతా అంశాన్ని పట్టించుకోకపోవటం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు, ఇతర అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 26లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని హైకోర్టు కోరింది. రెమిడీ ఫీవర్‌ ఇంజక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని శ్రీనివాస్ చెప్పారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. ఈనెల 27లోపు అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది.

Related Posts