YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ దిశగా మరిన్ని రాష్ట్రాలు

లాక్ డౌన్ దిశగా మరిన్ని రాష్ట్రాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23, 
ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్  వైరస్ ను నిరోధించేందుకు, దాని వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలేవీ అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదు. తాజాగా కేసులు గణనీయంగా పెరగడంతో మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెచ్చరిల్లుతోంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అలాగే వ్యాక్సిన్ లభ్యతకు సంబంధించి గట్టి చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా పరిస్థితిలో ఏ రకమైన మార్పు కనిపించలేదు. తాజాగా రెండు లక్షల 59 వేల కేసులు గత 24 గంటల్లోనే నమోదయ్యాయి. రోజువారీగా కోవిడ్ కేసులు 2 లక్షలు దాటడం వరుసగా ఇది ఆరవ రోజు. కేసుల తీవ్రత పెరగడంతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం  వ్యాక్సిన్ పరిధిని విస్తరించాలని నిర్ణయించింది.  
మరోపక్క కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నివారణ చర్యల్లో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలు అన్నింటిని మూసివేశాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. అదే తరహాలో మరికొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కోవిడ్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాంపిల్ పరీక్షలను ముమ్మరం చేసింది. ఒక్క సోమవారం నాడే  దాదాపు 15 లక్షల మేరకు పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) తెలిపింది.   . కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందని చెబుతున్న ప్రధాని మోడీ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే విషయంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు. కోవిడ్  వైరస్ ను ఎదుర్కోవాలంటే పరీక్షలు నిర్వహించడం ఎప్పటికప్పుడు కొత్త కేసుల వ్యాప్తిని అరికట్టడం, సరైన చికిత్సను అందించడం అనివార్యమనే సందేశాన్ని ప్రధాని మోడీ గట్టిగానే అందించారు.  
కోవిడ్ మొదటి దశకంటే కూడా రెండవ దశలోనే కేసుల తీవ్రత అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే టీకాలు వేయడం ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం అందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. సీరం, భారత్ బయోటెక్ సంస్థలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి గాను అడ్వాన్సుగా రూ. 4500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధిత కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.    

Related Posts