విశాఖపట్నం
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ మన దేశంలో ఆక్సీజన్ కొరత ఏర్పడిం ది. కోవిడ్ పేషెంట్లకు సకాలంలో ఆక్సీ జన్ అందక ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆక్సీజన్ సరఫ రాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి.. ఆస్పత్రులకు తరలిస్తోంది. వేగవంతం గా ఆక్సీజన్ తరలించేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చి ఆక్సీజన్ ఎక్స్ప్రెస్ను నడుపుతోంది. గురువారం అర్ధరాత్రి విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రలకు తొలి ఆక్సీజన్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరి వెళ్లింది. మొత్తం ట్యాంకర్లను మహారాష్ట్రకు తరలిస్తున్నారు.