అమలాపురం
దుర్గమ్మ కధలు చెప్పుకుంటూ అమాయక ఆడవాళ్ళను తన మాయమాటలతో బుట్టలో వేసుకుని వరుస అత్యాచారం, హత్యలకు పాల్పడిన కిరాతకుడికి జీవితఖైదు విధించారు. 2012 నుండి 2017 వరకు ఐదుగురు ఆడవాళ్ళను అత్యాచారంచేసి హత్యచేశాడు. కపిలేశ్వరపురం మండలం, కేదారిలంకకు చెందిన 24 ఏళ్ళ సాలాది లక్ష్మినారాయణ, తాను లోబర్చుకున్న మహిళలను ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న పిచ్చుకలంక ఇసుక తిన్నులలోనికి తీసుకువెళ్లి వారితో శారీరక అవసరాలు తీర్చుకుని, వారిని అక్కడే చంపివేస్తాడు. తరువాత వారిమీద ఉన్న బంగారు వస్తువులు దోచుకునేవాడు శవాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. నిందితునికి అమలాపురం రెండవ అదనపు జిల్లా జడ్జి సి.యన్. మూర్తి ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.. 2017లో అప్పటి రాజోలు సిఐ క్రిస్టోఫర్ ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందిడితుడు లక్ష్మీనారాయణను పట్టుకున్నారు. ప్రస్తుత సిఐ డి. దుర్గా శేఖర్ రెడ్డి నిందితునకు శిక్ష పడేవిధంగా సకాలంలో సాక్షులులను ప్రవేశపెట్టారు.
వివరాలలోనికే వెళితే నిడితుడు సాలాది లక్ష్మినారాయణ మామిడికుదురు గ్రామం లో అల్ కేస్టే కాలనీ లో 2006 సం డిసెంబర్ నెలలో దుర్గమ్మ కధ చెప్పాడు. ఆ సందర్బం లో చెపురి భాగ్యవతి అను వివాహితను లోబర్చుకొని ఆమెను జనవరి 2017 8వ తేదీన ధవళేశ్వరం బ్యారేజి దిగువన ఉన్న పిచ్చుకలంక ఇసుక తిన్నలలోనికి తీసుకువెళ్ళాడు. ఆమెతో శారీరక సంబందాలు పెట్టుకుని, అక్కడే చంపి ఆమెమీద ఉన్న బంగారు వస్తువులు దోచుకున్నాడు. మొదట మిస్సింగ్ కేస్ నమోదు చేసిన అప్పటి సిఐ కె. క్రిస్టోఫర్, కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి చేధించాడు. ఈకేసు తో పాటు మరో 4 కేసులు వెలుగుచూశాయి. మల్కిపురం ఐ.పోలవరం, కొవ్వుర్రు రూరల్ పిఎస్ లలో కూడా నిందితుడు ఇదే తరహా అత్యాచారాలు, హత్యలు చేశాడని తేలింది. ఈ కేసు లో కూడా నిందితుడు నేరాలను అంగీకరించాడు. 5 కేసులలో నిందితుడు ఆడవారిని చంపి దొంగిలించిన బంగారు వస్తువులును రికవరీ చేశారు పోలీసులు.. అమలాపురం రెండవ అదనపు జిల్లా జడ్జి సి.యన్. మూర్తి నగరం పోలీసు స్టేషన్ కు చెందిన కేసులో నిందితునకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. మరో వెయ్యి జరిమానా విధించారు. మరో నేరంలో మూడేళ్ళు జైలు శిక్ష, వెయ్యి జరిమానా విధించారు