న్యూ ఢిల్లీ ఏప్రిల్ 23
భారత్ లో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇండియా నుంచి వచ్చే ప్యాసింజర్, కమర్షియల్ విమానాలను 30 రోజులపాటు నిషేదిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా ప్రకటించారు. భారత్ నుంచి కెనడాకు వస్తున్న విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా కరోనా కేసులను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసే విమానాలు యధావిధిగా నడుస్తాయని చెప్పారు.గత రెండు వారల్లో కెనడాలోని టొరంటో లేదా వాన్‌కోవర్‌కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వచ్చాయని, వారిలో ఒక్కో విమానంలో కనీసం ఒక్క ప్రయాణికుడైనా అనారోగ్యం ఉన్నారని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కెనడాకు వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలో ప్రస్తుతం మూడో విడుత కరోనా విజృంభన నడుస్తున్నది. దేశంలో నిన్న 9 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 11,51,276కు చేరింది. ఇందులో 23,812 మంది మరణించారు. గతంలో బ్రిటన్ విమానాలపై కూడా ఇలాగే బ్యాన్‌చేసిన విషయం తెలిసిందే.