YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ నెల 30వ తేదీ తిరుపతిలో నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై సీఎం ధర్మపోరాటం కట్టుబడిపాలెం-పినపాక సైకిల్ యాత్రలో ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

 ఈ నెల 30వ తేదీ తిరుపతిలో నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై సీఎం ధర్మపోరాటం  కట్టుబడిపాలెం-పినపాక సైకిల్ యాత్రలో ఏపి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ర్టానికి కేంద్రం అన్యాయం చేస్తుంటే, రాష్ర్ట ప్రభుత్వంపై ఇష్టా రాజ్యంగా మాట్లాడం ఏమిటని బీజెపీ-వైసీపీ కుమ్మక్కుతో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వీరిద్దరి కుట్ర రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు మండలంలోని కట్టుబడిపాలెం, ఎన్టీఆర్ కాలనీ, పినపాక గ్రామాల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం జరిగిన సైకిల్ యాత్రలో పాల్గొని పలు సభలలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే మాకు జగన్ ఉన్నాడని కేంద్రమంత్రి అథావాలే బహిరంగంగా బీజెపీ-వైసీపీ లోపాయికారికి నిదర్శనమని పేర్కొన్నారు. హోదా, విభజన హామీలపై మొదటి సంవత్సరం ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు కొత్తగా కొంతమంతి ప్రశ్నిస్తున్నారని వాటికి సమాధానంగా పట్టిసీమ కట్టనిచ్చేవాళ్ళా? పోలవరం పనులు 52% పూర్తైయ్యేవా? వాటికి కూడా అడ్డంపడే వారని మంత్రి ఉమా వివరించారు. ప్రతిపక్ష నేత గురువారం లోటస్పాండ్కు, శుక్రవారం కోర్టుకు వెళ్లడం మాని.. పులివెందుల వద్ద కృష్ణా నీటిని తలపై చల్లుకుంటే జగన్ పాపం పోతుందని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజలు 40 ఏళ్ళుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తూనే వచ్చారని ఇప్పటి వరకు మీరు చేయలేని పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం కన్నా ముందే పులివెందులకు నీళ్ళిచ్చారని తెలిపారు. జగన్ పాదయాత్ర పేరుతో కోట్లు ఖర్చు పెట్టి సీఎంను నన్ను తిట్టడానికి మైలవరం వచ్చారని, పట్టిసీమ దండగన్న జగన్ గోదావరి నీళ్ళు వెలగలేరులో చెంబుతో పోసామని ఎగతాళిగా మాట్లాడారని, చెంబుతో పోస్తే ఎకరాకు 40 నుండి 50 బస్తాలు ధాన్యం ఏ విధంగా వచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీసారు. చంద్రబాబు మీద నమ్మకంతో రెండు, మూడు పంటలు పండే భూములను రైతులు స్వఛ్చందంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారని తెలిపారు. గ్రామాల్లో ఇంకా మిగిలినపోయిన పనులను పూర్తి చేసుకుందామని, ఈ నెల 30వ తేదీన తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే ధర్మపోరాట మహా సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts