YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ కమ్యూనిస్టులతో టీడీపీ పోత్తు దిశగా అడుగులు

కాంగ్రెస్ కమ్యూనిస్టులతో టీడీపీ పోత్తు దిశగా అడుగులు

విజయవాడ, ఏప్రిల్ 24, 
చంద్రబాబు ఏదో ఒకటి చేయాలి. ఇటు పవన్ కల్యాణ్ ను తనవైపునకు తిప్పుకోవాలి. లేదంటే మరో మార్గం చూడాలి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం మాత్రం అసాధ్యమని చంద్రబాబు నిర్ణయించారు. మరోసారి అపజయాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు తొలుత బీజేపీతోనే సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జగన్ కు ఇచ్చిన ప్రయారిటీ చంద్రబాబుకు ఇవ్వడం లేదు. చంద్రబాబు వల్ల ఉపయోగం లేదని కూడా బీజేపీ గట్టిగా నమ్ముతుంది.మరోవైపు రాష్ట్ర నేతల్లో అత్యధిక మంది టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆశలు నెరవేరే అవకాశాలు కష్టమే. ఇక పవన్ కల్యాణ్ ను మంచి చేసుకోవడం ఒక్కటే మార్గం. బీజేపీ లేకపోయినా పవన్ కల్యాణ్ అండ ఉంటే కొంత బలం పెరుగుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. కానీ తరచూ పార్టీల జెండాలను మారుస్తూ ఉంటే పవన్ కల్యాణ్ తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని భావిస్తున్నారు. బీజేపీ అంగీకరిస్తే టీడీపీతో కలిసేందుకు పవవ్ కల్యాణ్ ఇష్టపడుతున్నారు. కానీ చంద్రబాబును బీజేపీ దరి చేరనివ్వడం లేదు.అయితే ఇప్పుడు చంద్రబాబు వద్ద ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. కాంగ్రెస్ తో కలవడమే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కమ్యునిస్లు పార్టీలు కూడా కలసి వస్తాయి. పెద్ద కూటమిగా ఏర్పడుతుంది. బీజేపీ, జనసేన కూటమికి ధీటుగా తమ కూటమి ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మీద ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజల్లో ఆగ్రహం తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా కూడా అనారోగ్య కారణాలతో బయటకు రావడం లేదు. దీంతో ఆ ప్రభావం పెద్దగా ఉండదని చంద్రబాబు అనుకుంటున్నారు.ఇక ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజల ముందుకు మరోసారి వెళ్లే వీలుకలుగుతుంది. మోదీ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లోనే బీజేపీని ఏపీ ప్రజలు పక్కన పెట్టారు. ఈసారి జనసేన కలిసినా ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దీనికి తోడు కాంగ్రెస్, కమ్యునిస్టులతో పొత్తు పెట్టుకుంటే తక్కువ స్థానాలతో సరిపెట్టేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో సీరియస్ గా చర్చిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాుబ ఫస్ట్ ఆప్షన్ మాత్రం బీజేపీయేనట. చూడాలి ఏం జరుగుతుందో?

Related Posts