YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంగం పాపంలో ఎవరు...

సంగం పాపంలో ఎవరు...

గుంటూరు, ఏప్రిల్ 24, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనకు శాపంగా పరిణమించాయి. ఆయన జగన్ పై విమర్శలు చేసినా నాలుగు వేళ్లు చంద్రబాబువైపే చూపేలా ఉన్నాయి. నిజానికి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసింది చంద్రబాబు. తనకు తాను సీఈవోగా ప్రకటించుకున్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటి నుంచే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు మూతపడ్డాయి. ప్రయివేటీకరణతోనే అభివృద్ధి అన్న నినాదంతోనే చంద్రబాబు గతంలో పనిచేశారు. ఇక డెయిరీల విషయానికి వస్తే చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం అనేక డెయిరీలను ముంచేశారన్న ఆరోపణలున్నాయి. చిత్తూరు, ఒంగోలు ఇలా ఒక్కటేమిటి హెరిటేజ్ దెబ్బకు అనేక డెయిరీలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో డెయిరీలు మూతపడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక సంగం డెయిరీ విషయానికొస్తే తొలినుంచి దూళిపాళ్ల నరేంద్ర కుటుంబం ఛైర్మన్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సంగం డెయిరీని దెబ్బతీయాలని చంద్రబాబు చూశారన్న విమర్శలున్నాయి. సంగం డెయిరీ పాలకవర్గం నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ధూళిపాళ్ల నరేంద్ర పై వత్తిడి తెచ్చారంటారు. అయితే తమ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సంగం డెయిరీ ఛైర్మన్ పదవిని వదులుకోవడానికి నరేంద్ర సిద్దపడలేదు.అందుకనే చంద్రబాబు ధూళిపాళ్ల నరేంద్ర కు మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదంటారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు ప్రభుత్వంలో ఏ పదవి దక్కకపోవడానికి సంగం డెయిరీయే కారణమన్నది పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ డెయిరీ పై ఉన్న మక్కువ కారణంగా నరేంద్ర చంద్రబాబు డెయిరీ ఛైైర్మన్ పదవి నుంచి తప్పుకోలేదంటారు. ఇప్పుడ చంద్రబాబు జగన్ ను సహకారవ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని, అమూల్ ను తెచ్చి రాష్ట్ర డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేసినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఆయన విధానాలే ఆయన విమర్శలకు చెక్ పెడుతున్నాయి
టీడీపీ మూలాలపైనే గురిఁ
ఎన్ని విమర్శలొచ్చినా జగన్ తగ్గడం లేదు. టీడీపీ నేతల వరస అరెస్ట్ లతో బెంబెేలెత్తిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత వరసగా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలనే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు టీడీపీనేతలు చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే వారినే అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాన్ని జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే వెలగపూడి రామకృష్ణ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. శుక్ర, శనివారాలు వస్తున్నాయంటే టీడీపీ నేతలు బెదిరిపోయేలా జగన్ ప్రభుత్వం చర్యలుంటున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.తొలుత ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొల్లు రవీంద్రను ఒక హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జైలు జీవితం గడిపి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే వారే. ఇక మరో సీనియర్ నేత దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదయింది. ఆయనకు జగన్ ను విమర్శించిన కేసులో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది.ఇక తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర ను నేడు అరెస్ట్ చేశారు. ఆయన గత కొంత కాలంగా రాజధాని అమరావతి భూములు, విశాఖ భూములపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిని జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెబుతున్నారు. సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈయన సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలను వరసగా అరెస్ట్ లు చేస్తుండటం రాజకీయంగా ఏపీలో హీట్ ను రేపుతుంది.

Related Posts