YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మళ్లీ బ్యాంకులకు వరుస సెలవులు

మళ్లీ బ్యాంకులకు వరుస సెలవులు

బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో(తెలుగు రాష్ట్రాలు మినహా) శనివారం నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మరికొన్ని చోట్ల మూడు రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి.ఏప్రిల్‌ 28 ఈ నెలలో నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్‌ 29 ఆదివారం. ఇక ఏప్రిల్‌ 30 బుద్ధ పౌర్ణమి. తెలుగు రాష్ట్రాల్లో బుద్ధ పౌర్ణమికి సెలవు లేదు. కానీ మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్‌బంగా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు. దీంతో అక్కడ వచ్చే సోమవారం బ్యాంకులు పనిచేయవు. ఇక మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి.కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో మాత్రం ఏప్రిల్‌ 30 మినహా మిగతా మూడు రోజులు బ్యాంకులకు సెలవులే. అయితే బ్యాంకులు పనిచేయనప్పటికీ ఏటీఎంలలో ఎప్పటికప్పుడు డబ్బులు అందుబాటులో ఉండేలా చూస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లు కూడా పనిచేస్తాయని చెప్పారు.

Related Posts