YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ట్రంప్ తరహాలో మోడీ

ట్రంప్ తరహాలో మోడీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24, 
కరోనా మహమ్మారి తొలిదశలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తరహాలోనే ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కరోనాపై పెత్తనం చేయడం, ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ కూడా అమెరికాలో నాటి గవర్నర్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. కరోనా మరణాలు, కేసులు తీవ్రమవుతున్నా గవర్నర్ లు లాక్ డౌన్ పెట్టాలని సిఫార్సు చేసినా ట్రంప్ పట్టించుకోలేదు. అదే తరహాలో మోదీ కూడా లాక్ డౌన్ చివరి అస్త్రమని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండేందుకు ప్రజలనే చైతన్య వంతులనుచేయాలని కబుర్లు చెబుతున్నారు. దీనికి తోడు కోవిడ్ వ్యాక్సిన్ భారం కూడా రాష్ట్రాలపై మోదీ మోపారు. నిజానికి తొలి దశలో రాష్ట్రాలకు మోదీ అండగా నిలిచారు. వివిధ ప్యాకేజీలను ప్రకటించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని భావించి ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు అవి ఊరట కల్గించకపోయినా మూడు నెలల పాటు రాష్ట్రాలు నెట్టుకొచ్చాయి. అప్పులు చేసి మరీ తమ పాలనను సాగించాయి. కానీ సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న దశలో మోదీ పూర్తిగా రాష్ట్రాలను గాలికి వదిలేశారంటున్నారు. పీఎం కేర్ ఫండ్స్కు పెద్దయెత్తున తొలి దశలో విరాళాలు వచ్చాయి. వాటిని కోవిడ్ వ్యాక్సిన్ కోసం వినియోగించాలని అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మోదీ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ బాధ్యతను రాష్ట్రాలపైనే మోపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో మోదీ పూర్తిగా నియంతృత్వ ధోరణిని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అదే పద్ధతి కొనసాగిస్తే అమెరికాలో ట్రంప్ కు పట్టిన గతే మోదీకి పడుతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

Related Posts