కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వినీ దత్ నిర్మించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఓ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫిబ్రవరి 24 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.